90శాతం మంది చూపు ఎంటర్ టైన్మెంట్ వైపే

90శాతం మంది చూపు ఎంటర్ టైన్మెంట్ వైపే
తెలంగాణాలో 90% ఆడియన్స్ అత్యధికంగా వినోదాన్ని కోరుకుంటున్నారని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ తెలిపింది. డిస్నీప్లస్ హాట్ స్టార్ నిర్వహించిన సర్వే ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో మెట్రోయేతర నగరాల నుంచి వీక్షకుల సంఖ్య పరంగా 117% వృద్ధిని నమోదుచేసిన డిస్నీప్లస్ హాట్‌స్టార్‌.., తెలంగాణాలో ఈ ప్లాట్‌ఫామ్‌పై ఎంటర్ టైన్మెంట్ కంటెంట్‌లో 40% మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఓటీటీ తెలుగులో ఎక్కువ మంది వీక్షించిన సినిమాలు ప్రతి రోజూ పండుగే,బాగీ 3 చిత్రం కాగా, రాష్ట్రంలో మొత్తం వీక్షకుల సంఖ్యలో 75% బిగ్‌బాస్‌ చూశారు. అత్యధిక శాతం మంది కార్తీక దీపం సీరియల్ ను వీక్షించినట్ల తెలుస్తోంది. రాష్ట్రంలో 25% మంది బిగ్‌బాస్‌ ను చూసేందుకు అర్థరాత్రులు కూడా మేల్కొని చూస్తున్నారు. యాప్‌పై ఓట్లు పరంగా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 లోని 86వ ఎపిసోడ్‌ ఎక్కువ ఓట్లును సాధించింది. సీజన్‌–4 లో యాక్టింగ్ తో పాటు యాక్షన్‌ మిక్స్ అవ్వడంతో 23% ఆడియన్స్ వీక్లీ హైలెట్స్‌ చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ అధ్యయనం గురించి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ అధికార ప్రతినిధి సౌత్ ఇండియాలో వచ్చిన స్పందనపై సంతోషం వ్యక్తం చేశారు. మెట్రో నగరాలతో పాటుగా ఆన్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ వినియోగమనేది చిన్న నగరాలలో కూడా గణనీయంగా పెరిగిందన్నారు. హైదరాబాద్‌ తరువాత, రెండవ స్థానంలో విశాఖపట్నం షో యొక్క వీక్షణ పరంగా 20% వీక్షకులతో నిలిచింది. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం బిగ్‌బాస్‌ తెలుగు యొక్క ప్రాచుర్యం కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. మహారాష్ట్రలో ఉంటున్న వారు కూడా ఈ షోను అధికంగానే వీక్షించారు. తెలుగు రాష్ట్రాలకు వెలుపల అత్యధిక వీక్షణం ముంబైలోనే కనిపించింది. అంతేకాదు, ఆసక్తికరంగా, ప్రతి ఇద్దరి వీక్షకులలో ఒకరు తమ అభిమాన కంటెస్టెంట్‌కు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఓటు చేశారు.