మరింత పకడ్బందీగా ఆరోగ్య శ్రీ అమలు

మరింత పకడ్బందీగా ఆరోగ్య శ్రీ అమలు

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని మరింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావు లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లిన ఏ ఒక్క రోగి కూడా వెనక్కి తిరిగి రాకుండా, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన పేదలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చికిత్స అందిస్తామన్నారు. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. కరోనా తీవ్రత, కేసులు తగ్గినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బతుకమ్మ, దసరా పండుగల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ రెండు పండుగల్లో ప్రభుత్వ సూచనలను పాటించాలని ప్రజలకు మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు.