
- థర్డ్ పార్టీ సంస్థ ‘లూసిడ్’కు బాధ్యతలు అప్పగింత
- ఇప్పటికే మూడంచెలుగా పరీక్షిస్తున్న వాటర్ బోర్డు
- ఇకపై రిజర్వాయర్లు, ట్రీట్మెంట్ ప్లాంట్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల వద్ద వాటర్ అనాలసిస్ టెస్టులు
- ఐఎస్10500 ప్రమాణాలకు అనుగుణంగాఉండేలా చర్యలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో సరఫరా చేసే తాగునీటి నాణ్యతా పరీక్షలను ప్రతిరోజూ వాటర్ బోర్డు పరిధిలోని క్వాలిటీ అష్యూరెన్స్సెల్(క్యూఏటీ సెల్) నిర్వహిస్తూ వస్తోంది. ఇక నుంచి రిజర్వాయర్లతోపాటు ట్రీట్‌మెంట్‌ప్లాంట్ల వద్ద, బ్యాలెన్సింగ్రిజర్వాయర్ల వద్ద థర్డ్‌పార్టీతో క్వాలిటీ టెస్టులు చేయించాలని నిర్ణయించింది. టెండర్లు పిలిచి ఐఎస్10500: 2012 ప్రమాణాలకు అనుగుణంగా వాటర్అనాలసిస్టెస్టులు చేసే బాధ్యతను లూసిడ్అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ సీజన్ల వారీగా మెయిన్రిజర్వాయర్ల నీళ్లలో మార్పులను పరిశీలిస్తుంది. లూసిడ్ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రజలకు మరింత క్వాలిటీ వాటర్ అందించేందుకు వీలవుతుందని అధికారులు చెప్తున్నారు.
రోజుకు 5 వేల శాంపిల్స్
20 ఆపరేషన్అండ్ మెయింటెనెన్స్డివిజన్ల ద్వారా రోజుకు 550 ఎంజీడీల నీటిని వాటర్‌బోర్డు సరఫరా చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ నిబంధనలకు అనుగుణంగా వాటర్క్వాలిటీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బోర్డులోని క్వాలిటీ సెల్, ఐపీఎం, మరో స్వచ్ఛంద సంస్థ ద్వారా మూడంచెల్లో క్వాలిటీ టెస్టులు చేస్తున్నారు. రోజుకు దాదాపు 5 వేల శాంపిల్స్తీసుకుని పరీక్షిస్తున్నారు. ఈ ప్రాసెస్‌ను మరింత మెరుగుపరిచేందుకు థర్డ్‌పార్టీ ద్వారా జలాశయాలు, నీటిశుద్ధి కేంద్రాల నుంచి కూడా నీటి శాంపిల్స్సేకరించి పరీక్షలు నిర్వహించనున్నారు.
మూడు కాలాల్లోనూ పరీక్షలు
లూసిడ్సంస్థ గ్రేటర్‌కు నీళ్లిస్తున్న నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి నీటిని సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంది. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలంలో నీటిలో ఏర్పడే మార్పులను పరిశీలిస్తుంది. వేసవితోపాటు వర్షాకాలాల్లో రిజర్వాయర్లలోని నీళ్లలో ఆర్గనోలెప్టిక్, ఫిజికల్పారామీటర్స్, జనరల్పారామీటర్స్ద్వారా టాక్సిక్, రేడియోయాక్టివ్, పెస్టిసైడ్స్రెసిడ్యుయల్లిమిట్స్, బ్యాక్టీరియాలజికల్క్వాలిటీ, బయోకెమికల్ఆక్సిజన్డిమాండ్(వీవోడీ), కెమికల్ఆక్సిజన్డిమాండ్(సీవోడీ), వైరస్ఇండికేటర్స్ను చెక్చేస్తుంది.
ఎక్కడెక్కడంటే..
నాగార్జునసాగర్నీళ్లను కోదండపూర్‌లోని ట్రీట్మెంట్ప్లాంట్లోనూ, గోదావరి జలాలను మల్లారంలోని ప్లాంట్ లో, మంజీరా వాటర్‌ను రాజంపేటలో, సింగూరు నీటిని పెద్దాపూర్‌లో, హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్జలాలను ఆసిఫ్నగర్ఫిల్టర్స్వద్ద చెక్చేస్తారు. శుద్ధి చేయని, శుద్ధిచేసిన తర్వాత రెండు విడతల్లో శాంపిల్స్తీసి టెస్ట్చేస్తారు. అలాగే, ఆయా జలాశయాలకు సంబంధించి మాస్టర్బ్యాలెన్సిగ్రిజర్వాయర్లు, సర్వీస్ రిజర్వాయర్ల వద్ద కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్లలో నమూనాలు సేకరించి టాక్సిక్ మెటల్స్, ఆర్సెనిక్, లెడ్, క్యాడ్మమ్, క్రామిక్ అండ్ మెర్క్యూరీ, కోలిఫామ్స్అండ్ ఈ కోలి బ్యాక్టీరియల్టెస్ట్లు నిర్వహిస్తారు.
ఒక పక్క బోర్డు నిర్వహించే మూడంచెల టెస్టులతో పాటు, థర్డ్‌పార్టీ నిర్వహించే టెస్టుల నివేదికను ఎప్పటికప్పుడు నేషనల్అక్రిడేషన్బోర్డు(ఎన్ఏబీ)కి సమర్పిస్తారు. ఈ రిపోర్టుల ఆధారంగా మెట్రోవాటర్‌బోర్డు సరఫరా చేస్తున్న తాగునీరు స్వచ్ఛమైనవనీ, ఎలాంటి కాలుష్యం లేదని చెప్తూ ఎన్ఏబీ సర్టిఫై చేస్తుందని అధికారులు తెలిపారు.