ఫ్రీ బస్సులో కొట్టుకున్న మహిళలపై విజయవాడలో కేసు..

ఫ్రీ బస్సులో కొట్టుకున్న మహిళలపై విజయవాడలో కేసు..

ఏపీలో కూటమి సర్కార్ స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేసింది ప్రభుత్వం. ఇటీవలే అమల్లోకి వచ్చిన ఈ పధకానికి మహిళల నుంచి భారీగా ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉండగా.. ఫ్రీ బస్సు కారణంగా మహిళల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు మహిళలు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

విజయవాడ- జగ్గయ్యపేట బస్సులో చోటు చేసుకుంది ఈ ఘటన. బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు మహిళలు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకొని కొట్టుకున్నారు మహిళలు. ఈ ఘటనతో బస్సులో ఉద్రిక్తత నెలకొంది. సీటు కోసం మహిళల మధ్య మొదలైన వాగ్వాదం ఒకరినొకరు జుట్టు పట్టుకొని కొట్టుకునే స్థాయికి చేరింది. మహిళలు గొడవ పడుతున్న సమయంలో బస్సు డ్రైవర్, తోటి ప్రయాణికులు ఎంత చెప్పిన మహిళలు వినలేదు. దీంతో బస్సున నేరుగా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు బస్సు డ్రైవర్.

ఈ ఘటనతో షాక్ కి గురైన పోలీసులు గొడవ పడ్డ మహిళలపై కేసు నమోదు చేశారు. మహిళలపై BNS సెక్షన్ 3, 126(2)– బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించడం, 115(2)- ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, 351(2)- పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.