
వినాయక చవితి వచ్చింది.. 2025, ఆగస్ట్ 27వ తేదీ బుధవారం దేశం మొత్తం గణేష్ పప్పా మోరియా అంటూ వినాయకుడి పూజ చేస్తారు.. కాకపోతే ఇక్కడ అందరికీ ఓ డౌట్ వస్తుంది. ఆగస్ట్ 26వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆగస్ట్ 27వ తేదీ మధ్యాహ్నం వరకు చవిత తిథి ఉంది. 27వ తేదీ పండుగ చేసుకుంటున్నా.. ఏ సమయంలో పూజ చేయాలి.. మంచి కాలం ఏంటీ అనే సందేహాలు చాలా ఉన్నాయి. దీనికి పండితులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి.
చవితి తిథి ప్రారంభ సమయం : ఆగస్ట్ 26వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 54 నిమిషాలకు
చవితి తిథి ముగిసే సమయం : ఆగస్ట్ 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాలకు.
మీరు ఇంట్లో వినాయకుడి పూజను 2025, 27వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల 06 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాల మధ్య పూజను కంప్లీట్ చేయండి.
ALSO READ : వినాయకచవితి ఆగస్టు 27 : ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి..
పంచాంగం ప్రకారం వినాయకుడు ఈ సమయంలోనే జన్మించాడని చెబుతున్నారు. ఈ సమయంలో గణేష్ పూజను ఇంట్లో చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది చెబుతున్నారు పండితులు. ఉదయం 11 గంటలలోపు వినాయక పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సిబ్బంది చేసుకుని.. వినాయకుడిని అలంకరించుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాత పూజ ప్రారంభించాలని.. మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలలోపు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు