మారుతీ కొత్త కారు.. చూడ్డానికి SUV మోడల్ లో హెవీగా ఉన్నా 5 సీటరే..

మారుతీ కొత్త కారు.. చూడ్డానికి SUV మోడల్ లో హెవీగా ఉన్నా 5 సీటరే..

సామాన్యుడి ఫెవరెట్ కంపెనీ మారుతి సుజుకి ప్రతిఏడాది కొత్త కొత్త కార్లును తీసుకొస్తుంటుంది. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఒక కొత్త కార్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేసింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ బదులు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. దీన్ని  దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త ఎలక్ట్రిక్ మోడల్ కారుని తీసుకొస్తుంది. 

అయితే సెప్టెంబర్ 3న మారుతి సుజుకి ఈ కొత్త మోడల్‌ను విడుదల చేయాలనీ చూస్తుంది. ముందు అందరు దీనిని గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అనుకున్నప్పటికీ  తరువాత కొత్త  పేరుతో వస్తున్న  లేటెస్ట్ SUV అని తెలిసింది. ఈ SUVకి  Escudo అనే పేరు పెట్టె అవకాశం ఉంది, దీని కోసం కంపెనీ కొంతకాలం క్రితం ట్రేడ్‌మార్క్‌ కూడా అప్లయ్ చేసింది. అంతేకాకుండా ఈ కొత్త SUV నెక్సా షోరూమ్‌ల ద్వారా కాకుండా Y17 అనే కోడ్‌నేమ్ తో మారుతి  షోరూమ్‌ల ద్వారా అమ్మే అవకాశం ఉంది. 

డిజైన్: ఈ మిడ్-సైజ్ SUV  టెస్ట్ మోడల్  గత కొన్ని నెలలుగా చాలసార్లు కనిపించింది. ఫోటోల ప్రకారం గ్రాండ్ విటారాల కనిపించే ఆకారం, సైజ్ ఉంటుందని  తెలుస్తుంది. అయితే ముందు ఇంకా వెనుక హెడ్‌ల్యాంప్ & టెయిల్‌ల్యాంప్ డిజైన్‌  రీడిజైన్ చేసినట్లు కనిపిస్తున్నాయి. కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ కూడా దీనికి ఇచ్చే అవకాశం ఉంది.

ఇంటీరియర్స్ & ఫీచర్లు: కొన్ని లీకైన ఫోటోస్ ప్రకారం చాలా పెద్ద ఫ్లాట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో  పూర్తిగా కొత్త  డాష్‌బోర్డ్ లేఅవుట్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. విషయం ఏంటంటే ఈ SUV 7-సీట్ల SUV అని పుకార్లు వినిపిస్తున్నప్పటికీ ఇదొక 5-సీట్ల SUV కావొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ మారుతి SUVలో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా ఇంకా చాల ఫీచర్లతో వస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, EBDతో ABS, క్రూయిజ్ కంట్రోల్ వంటి  సేఫ్టీ  ఫీచర్స్ ఉంటాయి. 

పవర్‌ట్రెయిన్ సిస్టం : ఈ SUVని బ్రెజ్జా, గ్రాండ్ విటారాలాగానే గ్లోబల్ C ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. దీని 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ 103 bhp, 137 Nm పీక్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రావొచ్చు. అలాగే 87 bhp ఉత్పత్తి చేసే CNG మోటారు అప్షన్ కూడా ఇవ్వొచ్చు.