కాంగ్రెస్ ఓబీసీ సైద్ధాంతిక కమిటీ ఏర్పాటు.. కంచ ఐలయ్య, సుధాన్షు కుమార్తో పాటు 23 మందికి చోటు

కాంగ్రెస్ ఓబీసీ సైద్ధాంతిక కమిటీ ఏర్పాటు.. కంచ ఐలయ్య,  సుధాన్షు కుమార్తో పాటు 23 మందికి చోటు

ఓబీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ నినాదం, కుల జనగణన లక్ష్యంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఓబీసీ సైద్ధాంతిక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏఐసీసీ. మొత్తం 23 మంది సభ్యులతో ఓబీసీ ఐడియాలజికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించింది. 

కమిటీ నేషనల్ కన్వీనర్ గా ప్రొఫెసర్ సుధాన్షు కుమార్ నియమించిన ఏఐసీసీ.. ప్రొఫెసర్ కంచ ఐలయ్య వంటి మేధావులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 23 మంది మేధావులతో కూడిన కమిటీని ప్రకటించారు ఏఐసీసీ ఓబీసీ శాఖ ఛైర్మన్ డా. అనిల్ జైహింద్. 

బీసీ రిజర్వేషన్ల పెంపు, కుల జనగణనే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మేధావులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయడం మరో ముందడుగు. ఓబీసీ రిజర్వేషన్లు, హక్కులు మొదలైన అంశాలపై కమిటీ సూచనలు ఇవ్వనుంది.