మాంద్యం భయాల మధ్య 5 లక్షల మందికి ఉద్యోగాలు

మాంద్యం భయాల మధ్య 5 లక్షల మందికి ఉద్యోగాలు

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా దిగ్గజ టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచంలోని బలమైన దేశాలలో ఒకటైన అమెరికాలో కూడా కొన్ని కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించాయి. ఇలాంటి విపత్కర సమయంలో అమెరికా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరిలో 5 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగాలు పొందినట్లు యుఎస్ ప్రభుత్వం పేర్కొంది.  దీంతో అక్కడ నిరుద్యోగం 50 ఏళ్ల కనిష్ఠానికి చేరినట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వారికి సులభంగా కొలువులు దొరుకుతాయని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలో  ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో ఒక్క జనవరి నెలలోనే 5 లక్షల 17,000 మందికి కొత్త ఉద్యోగాలు పొందినట్టు అమెరికన్ లేబర్ మార్కెట్ డేటా వెల్లడించింది. ఫలితంగా ప్రస్తుతం అక్కడ నిరుద్యోగిత రేటు ఇప్పుడు 3.4 శాతానికి తగ్గిందని తెలిపింది. అంతకుముందు, అమెరికాలో 90 రోజుల్లోనే  పలు ఐటీ కంపెనీలు 2 లక్షల మందిని తొలగించాయి. అందులో 30 నుంచి 40 శాతం, అంటే 60 నుంచి 80 వేల మంది భారత సంతతికి చెందిన ఉద్యోగులే ఉండడం గమనార్హం. ఇదే తరహాలో ట్విట్టర్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అనేక IT కంపెనీల నుండి చిన్న స్టార్టప్‌లు కూడా లేఆఫ్‌లలో లను చేపడుతుండడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.