
ముంబై: తమకు ఉన్న హెల్త్పాలసీ అందించే ప్రయోజనాల గురించి మనదేశంలో 80 శాతం మందికి తగిన అవగాహన, సమాచారం లేదని ఫ్యూచర్ జనరలి ఇండియా ఇన్సూరెన్స్ సర్వే తెలిపింది. తాము ఆస్పత్రిలో చేరితో పాలసీ ఏ మేరకు ఉపయోగపడుతుందో లేదో కూడా వారికి తెలియదని స్పష్టం చేసింది. హెల్త్ అన్‌లిమిటెడ్ సర్వే ప్రకారం, ఆస్పత్రిలో చేరాక భారీ బిల్స్ రావడంతో ప్రతి ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు తమకు తగినంత కవరేజీ లేదని భావిస్తున్నారు. పది మందిలో తొమ్మిది మంది ఆరోగ్య బీమా పాలసీదారులు బీమా మొత్తాన్ని రీఛార్జ్ చేయడం చాలా ముఖ్యమని భావిస్తున్నారు.
సమగ్ర ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు వీరికి చాలా అవసరమని ఫ్యూచర్ జనరలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సీఈఓ అనూప్ రావు అన్నారు. తమ కంపెనీ 'హెల్త్ అన్‌లిమిటెడ్' అనే సమగ్ర ఆరోగ్య బీమా ఆఫర్‌ను తీసుకువచ్చిందని, అధిక బిల్లులు ఉన్న సమయాల్లో కూడా కస్టమర్లకు కవరేజ్ అయిపోకుండా చూసుకోవడానికి, వారి బీమా మొత్తం అయిపోయినప్పటికీ కవరేజీ అందిస్తుందని చెప్పారు.
25 ఏళ్లు పైబడిన 800 మంది పాలసీహోల్డర్లతో ఈ సర్వే నిర్వహించారు. 2021లో మిగతా ఆసియా దేశాల కంటే భారతదేశంలో అత్యధికంగా వైద్య ద్రవ్యోల్బణం ఉందని తేలిందని ఫ్యూచర్ జనరలి తెలిపింది.