ఇండియాలో IT ఎంప్లాయిస్ పరిస్థితి ఘోరం: 6 నెలల్లోనే 90వేల ఉద్యోగుల తొలగింపు

ఇండియాలో IT ఎంప్లాయిస్ పరిస్థితి ఘోరం: 6 నెలల్లోనే 90వేల ఉద్యోగుల తొలగింపు

ఐటీ పరిశ్రమల్లో 2024 సంవత్సరంలో విపరీతంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. 2024 సంవత్సరంలో గడిచిన ఆరు నెలల్లోనే 98 వేల 834 మందిని ఉద్యోగాల నుంచి తీసేనట్లు Layoff.ly సర్వేలో తేలింది. 2023 కంటే 2024లో 59శాతం లేఆఫ్ పెరిగాయని పేర్కొంది. కరోనా టైంలో ఓవర్ హైయిరింగ్, కంపెనీలు ఆర్థిక బారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తీసేయడం ప్రారంభించాయి. కొన్ని కంపెనీలు ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండానే సడన్ గా ఎంప్లాయిస్ ను తీసేస్తున్నాయని కొన్ని బిజినెస్ సర్వే సంస్థలు తెలిపాయి. ఎక్కువ జీతాలు తీసుకుంటున్న ఐటీ ఉద్యోగులనే టార్గె్ట్ గా లేఆఫ్ జరుగుతున్నాయి.

 నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) నివేదిక ప్రకారం, భారతీయ IT సేవా సంస్థల నుండి 2024 మొదటి ఐదు నెలల్లో దాదాపు 2,000 మరియు 3,000 మంది ఉద్యోగులు నోటిస్ పీరియడ్ ఇవ్వకుండా తొలగించారట. కొన్ని కంపెనీలు రాజీనామ చేయాలని బలవంతంగా ఎంప్లాయిస్ ను ఒప్పించాయి.