సగానికి పైగా కేసులు చార్మినార్​ జోన్​లోనే..

సగానికి పైగా కేసులు చార్మినార్​ జోన్​లోనే..

హైదరాబాద్, వెలుగు సిటీలో కరోనా తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వృద్ధురాలి ద్వారా 34 మందికి వైరస్​ వ్యాప్తించడం తీవ్రతను చెప్తోంది. ఒక్క చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోనే 219 కేసులు నమోదయ్యాయి. ఆ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని సర్కిళ్ల వారీగా చూస్తే.. ఇప్పటివరకూ మలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో 55,  సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 58, చంద్రాయణగుట్టలో 25, చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 22, ఫలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుమాలో 56, రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 కేసులు ఉన్నాయి. ఆసిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భవానీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తలాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కట్ట, మలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట ఏరియాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మర్కజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్​తోపాటు లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం, సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించకపోవడం, కంటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల నిర్వహణలో లోపాలే ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో వైరస్​ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి.

రెండ్రోజుల్లోనే 40 జోన్ల తొలగింపు

ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీలోని 6 సర్కిళ్ల పరిధిలో 70 కంటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్లు ఏర్పాటు చేశారు. బల్దియా  సమాచారం మేరకు ఈ నెల 2 నాటికి 50 జోన్లు ఉండగా, సోమవారానికి 10 మాత్రమే మిగిలాయి. రెండ్రోజుల్లోనే 40 జోన్లు ఎత్తేశారు. కరోనా సింప్టమ్స్​ కనిపించడానికి 20 రోజులకుపైగా పడుతుందని మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెబుతున్నారు. అధికారులు మాత్రం 15 రోజులు పూర్తి కాగానే కంటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్లను హడావిడిగా తొలగిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. బారికేడ్లు ఎత్తేయడంతో జనం బయటకు వస్తున్నారు. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలాఖరులో వారం రోజుల్లోనే సుమారు 14 వేల బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అధికారులు సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కొన్నిచోట్ల పోలీసులపై స్థానికులు గొడవకు దిగారు. ఇక్కడ లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలు సవాలుగా మారిందని అధికారులు చెప్తుండగా, సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఈ ఏరియాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్టు తెలిసింది. కంటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోన్లు తొలగించి వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాప్తికి పరోక్షంగా బల్దియా కారణమవుతోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.

మరింత పకడ్బందీగా ఉంటం..

కరోనా కట్టడి డ్యూటీల్లో బల్దియా చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండడం, ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీలో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెబుతున్నారు. నిర్దేశిత సమయాల్లో నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించినా, పెద్ద మార్కెట్లను మూసేస్తున్నాం. పోలీసులతో సమన్వయం చేసుకుని మరింత పకడ్బందీగా ఉంటాం.

– చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సామ్రాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌