2 కోట్లకుపైగా చలానాలు.. రూ.292 కోట్లు వసూళ్లు

2 కోట్లకుపైగా చలానాలు.. రూ.292 కోట్లు వసూళ్లు
  • 99 లక్షల చలానాలకు ఫైన్లు కట్టించుకున్న పోలీసులు
  •  పెండింగ్ లో 1,13,59,287 కేసులు
  • పెండింగ్ లో 1,13,59,287 కేసులు
  •  మూడు కమిషనరేట్లలో లెక్క ఇది
  • సిటీ కమిషనరేట్ లోనే అత్యధికం

ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినతరం చేసినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రతి ఏటా కోట్ల రూపాయలను ఫైన్ల రూపంలో చెల్లిస్తున్నారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో డిజిటల్‌ కెమెరాలు, స్పాట్ చెకింగ్ లతో ట్రాఫిక్ రూల్స్‌ బ్రేక్‌ చేసే వారు బుక్‌ అవుతున్నారు. సిగ్నల్ జంప్, స్టాప్ లైన్ క్రాస్ చేయడం,హెల్మెట్ లేకుండా డ్రైవ్‌ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ఇన్సూరెన్స్‌ లేకపోవడం ఇలా ఏ ఒక్క రూల్ బ్రేక్ చేసినా ఫైన్లతో వాత పడుతోంది. వందకు తగ్గకుండా  ట్రాఫిక్ చలానాలతో పాటు మరో 35 రూపాయలు అదనంగా సర్వీస్‌ చార్జీ ఉంటోంది.

రేట్ల పరిధిలో 2016 నుంచి 2018 డిసెంబర్31 వరకు 1,99,12,340 ట్రాఫిక్ చలాన్లు జనరేట్ అయ్యా యి. ఇందులో ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా1,11,37,786 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి 31వరకు 12,12,067 కేసులునమోదు చేశారు. దీంతో పాటు సైబరాబాద్లో 67,25,946, రాచకొండ కమిషనరేట్పరిధిలో 20,59,214 కేసులు నమోదయ్యాయి. ఇలా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిపైపోలీసులు కేసులు పెడుతున్నారు. అయినప్పటికీ చాలామంది తమ వెహికల్స్ పై పై ఉన్నపెండింగ్ ఛలానాలను చెల్లించకపోవడంతోపాటు రిపీటెడ్ గా రూల్స్‌ బ్రేక్‌ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు రూ. వందల కోట్లకు చేరుతున్నాయి.

ఇలా గతమూడేళ్ళలో వీటి సంఖ్య రూ.291.40 కోట్లుఉందంటే వాహనదారులు ఎంత మొత్తంలో ఫైన్లు చెల్లిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.మూడేళ్లలో నమోదైన 1,99,12,340 కేసుల్లో99,52,172 ట్రాఫిక్ ఉల్లం ఘనలకు సంబంధించి న రూ.291.40కోట్ల జరిమానాలువసూలు చేశారు. వీటిలో మరో 1,13,59,287పెండింగ్‌ కేసుల్లో డబ్బులను వసూలు చేయాల్సిఉంది. ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ తో పాటు సీసీకెమెరాలు, ట్రాఫిక్ పోలీసుల చేతుల్లోని డిజిటల్కెమెరాలతో ఈ చలానాలు విధిస్తున్నారు. ప్రత్యేకంగా హెల్మెట్‌ లేకుండా డ్రైవ్‌ చేసిన కేసులనుపరిశీలిస్తే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్పరిధిలో 2016 నుంచి ఈ ఏడాది మార్చి 31వరకు మొత్తం 82,80,278 కేసులు నమో-దయ్యా యి. మూడు కమిషనరేట్ల పరిధిలోనమోదవుతున్న ట్రాఫిక్ కేసుల్లో సింహభాగంహెల్మెట్ చలానాల రూపంలోనే వాహనదారులు చెల్లిస్తున్నారు.