
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో ఇండియాకు నిరాశే మిగిలింది. పతకంపై అసలు సజీవంగా ఉంచిన సచిన్ యాదవ్ ఇండియాకు పతకం తీసుకొని రావడంలో విఫలమయ్యాడు. 85.96 త్రో సాధించిన సచిన్.. స్టాండింగ్స్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సచిన్ తృటిలో పతకాన్ని కోల్పోవడంతో దేశానికి హార్ట్ బ్రేక్ తప్పలేదు. యువ అథ్లెట్ సచిన్ యాదవ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాన్ని కేవలం 40 సెంటీమీటర్ల తేడాతో కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్.. తన వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు (86.27) ను నమోదు చేశాడు.
నీరజ్ చోప్రా తన మునుపటి అత్యుత్తమ 84.03 మీటర్లను దాటడంలో విఫలమయ్యాడు. మరోవైపు సచిన్ యాదవ్ తన మునుపటి త్రో 86.27 మీటర్లను అధిగమించలేకపోయాడు. తన మొదటి ప్రయత్నంలోనే 86.27 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచాడు. గ్రెనడా అథ్లెట్ ఆండర్సన్ పీటర్స్ రజతం.. ట్రినిడాడ్ అండ్ టొబాగో అథ్లెట్ కెషోర్న్ వాల్కాట్ స్వర్ణం లభించింది. అమెరికా అథ్లెట్ దిన కర్టిస్ థాంప్సన్ కాంస్యం సాధించాడు.
నీరజ్ చోప్రాకు నిరాశ:
డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ నుంచి నిష్క్రమించాడు. తన మొదటి ఐదు ప్రయత్నాల్లో విఫలం కావడంతో మెన్స్ జావెలిన్ ఫైనల్ నుండి దురదృష్టవశాత్తు నిష్క్రమించాల్సి వచ్చింది. పురుషుల జావెలిన్ ఫైనల్‌ను నీరజ్ 8వ స్థానంతో ముగించాడు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తన కిరీటాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యాడు.
27 ఏళ్ల ఈ టాప్ ఇండియన్ అథ్లెట్ డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అయితే టోక్యోలో అతను విఫలమయ్యాడు. ఫైనల్‌లో నాలుగో రౌండ్‌లో ఓడిపోయాడు. నీరజ్ అత్యధిక స్కోరు రెండవ రౌండ్‌లో 84.03 మీటర్లతో నమోదైంది. ఆ తర్వాత నీరజ్ తన శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా తన చివరి త్రోలో నీరజ్ సరిగ్గా ల్యాండ్ కాకపోవడంతో తదుపరి రౌండ్ కు అర్హత సాధించలేకపోయాడు.