మంచి అవకాశం.. చంద్రయాన్-3 మహా క్విజ్ కు గడువు పెంపు

మంచి అవకాశం.. చంద్రయాన్-3 మహా క్విజ్ కు గడువు పెంపు

చంద్రయాన్ 3 మహా క్విజ్‌ రిజిస్ట్రేషన్ కోసం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గడువును పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అక్టోబర్ 31, 2023 వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. చంద్రయాన్-3 మహా క్విజ్ లో పాల్గొనేవారు సాధారణంగా చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష శాస్త్రం గురించి జ్ఞానాన్ని పరీక్షించుకోవచ్చు. దేశం అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ క్విజ్ లక్ష్యం. ఇది అంతరిక్ష కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రేరేపిస్తుంది.

Also Read : దేవభూమిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలివే.. లిస్టవుట్ చేసిన మోదీ

చంద్రయాన్ 3 మహా క్విజ్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో MyGov దీన్ని నిర్వహిస్తోంది. ఈ క్విజ్‌లో అంతరిక్ష శాస్త్రం, చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష అన్వేషణకు సంబంధించిన వాటి గురించి మల్టీ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. అందులో నుంచి విద్యార్థులు సరైనదాన్ని ఎంచుకోవాలి. క్విజ్ లో పాల్గొనే వ్యక్తికి 3వందల సెకన్లలో 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి రూ.1లక్ష నగదును బహుమతిగా ఇవ్వనున్నట్టు కమిషన్ ఇంతకుముందే ప్రకటించింది.

రెండవ స్థానంలో నిలిచిన వారు రూ.75వేలు, మూడో స్ఖానంలోని అభ్యర్థి రూ. 50వేలు అందుకుంటారు . తదుపరి వంద మంది ఉత్తమ ప్రదర్శనకారులకు రూ.2వేల కన్సోలేషన్ బహుమతులు అందజేయబడతాయి. మిగిలిన రెండు వందల మంది ఉత్తమ ప్రదర్శనకారులకు రూ.1వెయ్యి కన్సోలేషన్ బహుమతులు అందజేయబడతాయి .