
పసిఫిక్ మహా సముద్రం.. రష్యా దేశం పరిధిలో ఉన్న కమ్చట్కా ద్వీపం.. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ కమ్చట్కా ద్వీపంలో వచ్చే భూకంపాలు కచ్చితంగా సునామీని సృష్టిస్తుంది.. అంతే కాదు.. రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద జల ప్రళయాలకు ఈ కమ్చట్కా ద్వీపం కారణం అవుతుందని జపాన్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎందుకు.. ఏంటీ.. ఎలా అనేది కూడా వివరిస్తున్నారు అధికారులు.
కమ్చట్కా ద్వీపం ఏరియాలోని సముద్రం అడుగున పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. వీటిని ఎంపరర్ సీమౌంట్ చైన్ అని పిలుస్తారు. ఇవి సముద్ర గర్భంలో పర్వతాలు మాదిరిగా విస్తరించి ఉన్నాయి. 2 వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ఎంపరర్ సీమౌంట్ చైన్ పర్వతాల శ్రేణి అనేది.. భూమట్టానికి 6 వేల మీటర్ల లోతు వరకు ఉన్నాయి. సముద్రంలో కనిపించేది మాత్రం 2 వేల మీటర్లే అయినా.. సుమారు 4 వేల మీటర్లు అనేది సముద్రం లోతుల్లో ఉంది. ఎంపరర్ సీమౌంట్ చైన్ అని పిలవబడే ఇవి.. కమ్చట్కా ద్వీపానికి ఉత్తరం నుంచి దక్షిణ భాగానికి విస్తరించి ఉన్నాయి.
సముద్రం లోపల ఉన్న ఈ పర్వతాలు ఉన్న ప్రాంతం అనేది భౌగోళికంగా ఎంతో ప్రమాదకరంగా ఉంటుందని.. భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని జపాన్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తరచూ ఇక్కడ భూకంపాలు వస్తున్నా.. 8.8 తీవ్రతతో భూకంపం రావటం అనేది 1952 తర్వాత ఇదే అంటున్నారు అధికారులు. ఇక్కడ భూకంపం ఏర్పడితే అది కచ్చితంగా సునామీకి దారి తీస్తుందని.. 1952లో కూడా తీర ప్రాంతాన్ని రాకాసి అలలు ముంచెత్తాయని స్పష్టం చేస్తున్నారు అక్కడి అధికారులు.
2025 జూలై 30వ తేదీ వచ్చిన భూకంపం కూడా అక్కడి నుంచే వచ్చిందని.. ఈసారి 8.8 తీవ్రతతో భారీగా ఉందన్నారు. సునామీ అలలు ఒక రోజు కంటే ఎక్కువే వస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో తీరం దాటడానికి 9 నుంచి 10 గంటల సమయం కూడా పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సునామీ హెచ్చరికలను 24 గంటలు కంటే ఎక్కువ సమయం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు జపాన్ వాతావరణ శాఖ అధికారులు.
జపాన్ దేశానికి చాలా దూరంలో.. ఎక్కడో భూకంపం వస్తే మనకు సునామీ వస్తుందా.. సునామీ తీవ్రత తక్కువగా ఉంటుంది అనే ఆలోచన కూడా చేయొద్దని జపాన్ ప్రజలను హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కమ్చట్కా ద్వీపంలోని భూకంపంతో వస్తున్న సునామీలు చాలా ఉంటాయి.. ఒకేసారి రాదని.. మొదటగా తీరాన్ని తాకే సునామీ అలల తీవ్రత తక్కువగా ఉంటుందని.. ఆ తర్వాత వచ్చే అలల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. భూకంపం వచ్చిన తర్వాత.. ఆయా తీరాలను తాకే సమయం.. ఆయా ప్రాంతాలకు ఉన్న దూరంతో ముడిపడి ఉందని.. కొన్ని తీర ప్రాంతాలను సునామీ అలలు తాకే సమయం 9 నుంచి 10 గంటల సమయం ఉంటుందని.. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ALSO READ : Earthquake: టిబెట్ను కుదిపేస్తున్న భూకంపాలు, భారీవర్షాలు..ఒకే రోజు రెండుసార్లు భూకంపం
కమ్చట్కా ద్వీపంలో ఏర్పడే సునామీలు చాలా ప్రమాదకరం అని.. సముద్రంలోని పర్వతాలు వల్ల రాబోయే కాలంలోనూ భారీ భూకంపాలతోపాటు పెద్ద పెద్ద సునామీలు వచ్చే అవకాశం కూడా ఉందని.. జల ప్రళయాలకు అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 1952లోనూ ఇలాంటిదే వచ్చిందని.. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో వచ్చిందని చెబుతున్నారు. ఈ సునామీ అమెరికా, జపాన్, రష్యా దేశాలతోపాటు చిలీ, సోలోమాన్ ఐస్ ల్యాండ్స్ ప్రాంతాలకు ముప్పు ఉంటుందని హెచ్చిరిస్తున్నారు. రాబోయే కాలంలో జల ప్రళయానికి కమ్చట్కా ద్వీపం అనేది కారణం కావొచ్చు కూడానూ..