రష్యా-గోవా విమానానికి బాంబ్ బెదిరింపు..

రష్యా-గోవా  విమానానికి బాంబ్ బెదిరింపు..

రష్యా - గోవా  విమానాన్ని ఉజ్బెకిస్తాన్ కు దారి మళ్లించారు. 238 మంది ప్రయాణికులతో  రష్యా నుంచి  బయల్దేరిన విమానంలో బాంబు ఉందంటూ గోవాలోని డబోలిమ్ విమానాశ్రయానికి ఈ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఏవియేషన్ అధికారులు విమానాన్ని ఉజ్బెకిస్తాన్ కు  దారి మళ్లించారు. విమానంలో 7 మంది సిబ్బందితో సహా మొత్తం 238 మంది ప్రయాణికులు ఉన్నారు.

రష్యా నుంచి బయల్దేరిన అజుర్ ఎయిర్ AZV2463 ఫ్లైట్ ఇవాళ తెల్లవారుజామున 4:15 గంటలకు గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు అమర్చినట్లు  డబోలిమ్ విమానాశ్రయం డైరెక్టర్‌కు అర్ధరాత్రి 12:30 గంటలకు ఈ మెయిల్ రావడంతో ఉజ్బెకిస్తాన్ కు మళ్లించామని ఓ అధికారి తెలిపారు. రెండు వారాల క్రితం మాస్కో నుంచి గోవా వచ్చిన అజుర్‌ ఎయిర్‌ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఎయిర్‌పోర్టుకు మళ్లించిన సంగతి తెలిసిందే.