బీ అలర్ట్:డేటింగ్ యాప్స్..డేటా అమ్మేస్తున్నాయ్

బీ అలర్ట్:డేటింగ్ యాప్స్..డేటా అమ్మేస్తున్నాయ్

డేటింగ్ యాప్ అంటే యువతలో మంచి క్రేజ్ ఉంది. 18 నుంచి 29 సంవత్సరాల వయసు మధ్య గల వారు ఈ యాప్ వాడకం ఎక్కువగా ఉంది.ఈ ఆన్ లైన్ డేటింగ్ యాప్ ను వినియోగించి కొత్తవారితో పరిచయాలు, స్నేహం, ప్రేమ ఇలాంటివి ఏర్పడతాయి. ఆన్ లైన్ ద్వారా స్వచ్ఛమైన ప్రేమను వెతుక్కుంటున్నామని యుూత్ అంతా చెబుతున్నారు.అయితే ఈ యాప్ ద్వారా యూజర్ల డేటా మిస్ యూజ్ అవుతున్నట్లు ఇటీవలి సర్వేల్లో తేలింది. 

డేటింగ్ యాప్ లు వినియోగదారుల డేటాను అడ్వర్ టైస్ మెంట్ కోసం అమ్ముతున్నారని సర్వేల్లో వెల్లడయింది. FirFox  ఇంటర్నెట్ బ్రౌజర్ డెవలపర్ అయిన  Mozilla ద్వారా మొత్తం 25 డేటింగ్ యాప్ లను పరిశీలించగా.. వాటిలో 22 డేటింగ్ యాప్ లలో యూజర్ల డేటా ప్రైవసీ లేదని తెలిసింది. 

డేటా ప్రైవేసీ లేదు 

మెజిల్లా నివేదిక ప్రకారం.. కస్టమర్ల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించడంలో ఈ డేటింగ్ యాప్ లు విఫలమయ్యాయి. అయితే క్వీర్ కు చెందిన లెక్స్ వంటి డేటింగ్ యాప్ తోపాటు Happn , Harmony యాప్ లు కస్టమర్ డేటా భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మంచి రేటింగ్ ను పొందాయి. 

Also Read:లోక్ సభ ఎన్నికల బరిలో మా ఊరి పొలిమేర నటి

డేటింగ్ యాప్ యూజర్లకు సూచనలు 

మొదట మీ ఫ్రొఫైల్ ను లింక్డ్ ఇన్ ఫ్రొఫైల్ మాదిరిగా ఉంచుకోవాలి. ఇన్ ఫర్మేషన్ షేరింగ్ జాగ్రత్తగా ఉండాలి. 
యాప్ లాగిన్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం అంటున్నారు నిపుణులు. థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా లాగిన్ కాకుడదని హెచ్చరిస్తున్నారు. 
సాధ్యమైనంత వరకు యాప్ పర్మిషన్లను పరిమితం చేసుకోవాలి. దీని ద్వారా డేటింగ్ ఫ్లాట్ ఫాంల ద్వారా డేటా షేరింగ్ కాకుండా జాగ్రత్త పడవచ్చు.