లోక్ సభ ఎన్నికల బరిలో మా ఊరి పొలిమేర నటి

లోక్ సభ ఎన్నికల బరిలో మా ఊరి పొలిమేర  నటి

2024 లోక్ సభ ఎన్నికల్లో చాలా మంది సినీ సెలబ్రేటీలు పోటీ చేస్తున్నారు. తాజాగా ఆ లిస్టులోకి మరో నటి కూడా చేరిపోయారు.  మా ఊరి పొలిమేర సిరీస్ లతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి సాహితి తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు.  రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్‌ సమర్పించారు. తన ఆస్తులు సుమారు ఐదు లక్షలుగా చూపించారు. తన వయసు 29 ఏళ్లు అని, తనకు ఇంకా పెళ్లి కాలేదని అఫిడివిట్‌లో పేర్కొన్నారు.

మా ఊరి పొలిమేర సిరీస్ లలో గెటప్‌ శ్రీను భార్యగా నటించారు దాసరి సాహితి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌, ఆకాష్ గోపరాజు హీరోగా వచ్చిన సర్కారు నౌకరి ఇంకా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాల్లో ఆమె నటించారు.  అంతకుముందు ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయాలపై స్పందించిన సాహితి..  తాను పవన్‌కల్యాణ్ అభిమానినని చెప్పారు.  

Also Read:బీ అలర్ట్:డేటింగ్ యాప్స్..డేటా అమ్మేస్తున్నాయ్

ఇక చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ప్రకటించాయి. బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రంజిత్‌రెడ్డి బీజేపీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ బరిలో నిలిచారు.  మరి వీరితో పోటీలో నిలిచిన దాసరి సాహితి ఎన్ని ఓట్లు సాధిస్తుందో చూడాలి.