మీకు ఆ కార్లు ఎక్కడినుంచి వచ్చాయి?..DUSU పోల్ప్రచారంలో..లగ్జరీ కార్ల వాడకంపై హైకోర్టు సీరియస్

మీకు ఆ కార్లు ఎక్కడినుంచి వచ్చాయి?..DUSU పోల్ప్రచారంలో..లగ్జరీ కార్ల వాడకంపై హైకోర్టు సీరియస్

DUSU పోల్ ప్రచారంలో లగ్జరీ కార్ల వాడకంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్​అయ్యింది. ఎన్నికల ప్రచారంలో బెంట్లీ, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లు ,JCB లు కూడా - ఉపయోగించడంపై ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.DUSU పోల్ ప్రచారంలో లగ్జరీ కార్ల వాడకంపై కొత్తగా ఎన్నికైన DUSU అధ్యక్షుడు, ABVPకి చెందిన ఆర్యన్ మాన్ ,NSUI ఉపాధ్యక్షుడు రాహుల్ జాన్​స్లాకు నోటీసులు జారీ చేసింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే  ఎలా ఉంటుందో.. గత పోల్​ ఫలితాలను నిలిపివేస్తూ గతేడాది జారి చేసిన ఉత్వర్తులు మర్చిపోయారా అని.. అభ్యర్థులు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని ఢిల్లీ హైకోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్​ జస్టిస్​ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్​ తుషార్ రావులతో కూడిన ధర్మాసనం ఈ కామెంట్స్​చేసింది. 

విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఇలాంటి ప్రచారం కంటే దారుణం ఇంకోటి ఏముంటుంది..జేసీబీలు, పెద్ద పెద్ద లగ్జరీ కార్లతో ఎన్నికల ప్రచారం ఎప్పుడూ చూడలేదు. బెంట్లీ, రోల్స్ రాయిస్ ,ఫెరారీలు వంటి పెద్ద కార్లను అభ్యర్థులకు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్నించారు. హైకోర్టు కొత్తగా ఎన్నికైన DUSU అధ్యక్షుడు ABVPకి చెందిన ఆర్యన్ మాన్ ,NSUI ఉపాధ్యక్షుడు రాహుల్ జాన్​స్లాకు నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ యూనివర్సిటీలో ప్రతియేటా ఎన్నికల జరగడం సాధారణంగా మారింది. గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నికల నిర్వహిణలో వస్తున్న మార్పులు ఆందోళన కలిగిస్తోంది హైకోర్టు ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది