కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోలుపై నిషేధం

కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోలుపై నిషేధం

కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోలుపై విధించిన రెండేళ్ల నిషేధంఅమల్లోకి వచ్చింది. కరోనా తర్వాత ఆ దేశంలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో చాలా మంది కెనడా వాసులు ఇళ్లు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాని రేసులో ఉన్న జస్టిన్‌ ట్రూడో రెండేళ్ల బ్యాన్‌ను ఎన్నికల హామీగా ఇచ్చారు. వ్యాపారులు, సంపన్న కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడిదారులకు ఇళ్ల కొనుగోళ్లు లాభసాటిగా మారాయి. దాంతో పాటు దీంతోపాటు ఈ పరిస్థితి కారణంగా ఖాళీ ఇళ్లు, స్పెక్యులేషన్‌, ధరలు భారీగా పెరిగాయని లిబరల్ పార్టీ వివరణ ఇచ్చింది. ఇక ట్రూడో ఎన్నికల్లో విజయం అనంతరం కెనడావాసులు కాని వారు ఇళ్లు కొనడంపై తాజాగా నిషేధం అమలు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈ కొత్త చట్టంలో శరణార్థులు, పర్మినెంట్‌ రెసిడెంట్స్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ నిషేధం కేవలం నివాస గృహాలకు మాత్రమే వర్తిస్తుందని, రిక్రియేషన్‌ ఆస్తులకు మాత్రం వర్తించదని అక్కడి ప్రభుత్వం డిసెంబర్‌లోనే వివరణ ఇచ్చింది. ప్రస్తుతం కెనడాలోని ఇళ్లల్లో కేవలం 5శాతం మాత్రమే విదేశీయుల చేతిలో ఉన్నట్లు గణాంకాలు చెబతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలు పెద్దగా ఫలితమివ్వవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.