పబ్‎లో దొరికిన 148 మందిలో చాలామంది ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్

పబ్‎లో దొరికిన 148 మందిలో చాలామంది ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్

బంజారాహిల్స్‎లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. డ్రగ్స్ కేసులో పోలీసులపై వరుస ఆరోపణలు, విమర్శలు రావడంతో కేసును సవాల్‎గా తీసుకున్నారు. డ్రగ్స్ కేసును ఛేదించేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్‎లో గతంలో కూడా డ్రగ్స్ దందా నడిచినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 148 మందిలో ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారు, కొందరే డ్రగ్స్ తీసుకున్నారా, పబ్‎కు వచ్చే వారు డ్రగ్స్‎కు అలవాటు పడ్డారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా.. పబ్‎కు వచ్చిన వారంతా తామెవ్వరూ డ్రగ్స్ తీసుకోలేదు అంటున్నారు. మరి పబ్‎లో డ్రగ్స్ ఎలా దొరికాయి, ఎవరు తెచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా 148 మందిలో పబ్‎కు రెగ్యులర్‎గా వచ్చే యువతీ, యువకుల లిస్ట్ తయారు చేస్తున్నారు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్‎కు రెగ్యులర్‎గా వచ్చే వారిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. డ్రగ్స్ కేసు కొలికి వచ్చే వరకు 148 మంది తమకు అందుబాటులో ఉండాలని పోలీసులు సూచించారు.  అయితే 148 మందిలో చాలా మంది తమతమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 148 మందిలో కొందరు యువతీ, యువకులు అందుబాటులో లేనట్లు కూడా తెలుస్తోంది. 

పబ్‎లో దొరికిన 148 మందిలో సెలబ్రిటీలు, వీఐపీలు, సంపన్నులు, పొలిటీషియన్స్ పిల్లలు ఉండటంతో వారిని నేరుగా విచారించేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. అయితే మిగతా డ్రగ్స్ కేసుల్లాగా ఇది కూడా కొన్ని రోజులు హడావుడి చేసి పక్కన పడేస్తారా లేక పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

For More News..

కొరియర్‎లో 92 కత్తులు

రెండు వారాల్లో రూ. 10 పెరిగిన పెట్రోల్ రేటు

రూపాయికే కిలో ఉల్లి అమ్మిన రైతులు