తప్పులు చేస్తే తిప్పలు తప్పవు .. ఆరోగ్యబీమా విషయంలో జాగ్రత్త

తప్పులు చేస్తే తిప్పలు తప్పవు .. ఆరోగ్యబీమా విషయంలో జాగ్రత్త

వెలుగు బిజినెస్​డెస్క్​: హెల్త్​ఇన్సూరెన్స్​ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకునే సమయంలో అప్రమత్తంగా ఉండకపోతే చాలా నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సరైన పరిశీలనతో, పూర్తి సమాచారం తెలుసుకున్నాకే సంతకాలు పెట్టాలి. ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేటప్పుడు, తర్వాత సమస్యలను ఎదుర్కోకుండా తగినంత కవరేజీని పొందేలా చూసుకోవాలి. బీమా విషయంలో ఎక్కువ మంది ఐదు తప్పులు చేస్తారు. అవేంటో.. వాటిని నివారించడం ఎలాగో తెలుసుకుందాం. 

1.పాలసీ రూల్స్​ను అర్థం చేసుకోవడం:

పాలసీ డాక్యుమెంట్​లోని ఫైన్ ప్రింట్ (రూల్స్​వివరాలు) చదవడం మరచిపోవద్దు. మినహాయింపులు ( కవర్ కానివి), వెయిటింగ్ పీరియడ్‌‌‌‌‌‌‌‌లు (కవరేజ్ వర్తించే ముందు సమయం)  క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ విధానాల రూల్స్​ను తప్పక చదవాలి. పాలసీ నిబంధనలను,  షరతులను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం అతిపెద్ద తప్పు. కవరేజ్ పరిమితులు, చెల్లింపులు,  తగ్గింపుల గురించి కూడా తెలుసుకోవాలి. లేకపోతే క్లెయిమ్‌‌‌‌‌‌‌‌ల సమయంలో అపార్థాలు,  ఊహించని ఖర్చులు ఎదురు కావొచ్చు.

2. చౌకైన పాలసీ తీసుకోవడంలో రిస్క్​ ఉండొచ్చు: 

 ప్రీమియం ధర ఆధారంగా మాత్రమే ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం పొరపాటు కావచ్చు. చౌకైన పాలసీలు తగినంత కవరేజీని ఇవ్వలేకపోవచ్చు లేదా విపరీతమైన పరిమితులను పెట్టవచ్చు. కవరేజ్, నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ఆసుపత్రులు, క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ రేషియో,  కస్టమర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను పరిగణనలోకి తీసుకుని   బీమా సంస్థల పాలసీలను పోల్చడం చాలా కీలకం. కేవలం బ్రాండ్/కంపెనీ వారి ప్రకటనలను నమ్మకూడదు. పాలసీని నిర్ణయించేటప్పుడు ఇవన్నీ చూసుకోండి. 

3. ప్రీ-ఎగ్జిస్టింగ్​, వెయిటింగ్ ​ పీరియడ్స్​: 

ఇది వరకే ఏవైనా వ్యాధులు ఉంటే,   వాటిని కచ్చితంగా వెల్లడించాలి. లేక క్లెయిమ్ తిరస్కరణకు దారి తీస్తుంది.  నిర్దిష్ట చికిత్సలు లేదా ముందుగా ఉన్న వ్యాధుల చికిత్సల కోసం వెయిటింగ్​పీరియడ్​ గురించి తెలుసుకోండి. కొన్ని చికిత్సలకు చాలా టైం పట్టొచ్చు. కొత్తగా ఏవైనా వ్యాధులు వచ్చినా కంపెనీకి తెలియజేయాలి.

4.నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ హాస్పిటల్స్‌‌‌‌ను విస్మరించడం: 

చాలా ఆరోగ్య బీమా పథకాలు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ఆసుపత్రులలో క్యాష్​లెస్ ​ట్రీట్​మెంట్లను అందిస్తాయి. ఆపద వచ్చినప్పుడు వీలైనంతవరకు నెట్​వర్క్​ఆస్పత్రిలోనే చేరడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. లేకపోతే జేబు నుంచి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ రావడంలోనూ ఇబ్బందులు ఉండొచ్చు. పాలసీని కొనుగోలు చేసే ముందే, నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ల లిస్టును తనిఖీ 
చేయండి.

5. రెన్యువల్ రూల్స్​తెలుసుకోవడం​ తప్పనిసరి: 

చాలా మంది పాలసీదారులు తమ ఆరోగ్య బీమా పాలసీల రెన్యువల్ ​రూల్స్​ను పట్టించుకోరు. ప్రీమియం మార్పులు, కవరేజ్ మార్పులు,  ఏవైనా కొత్త మినహాయింపులు వంటివి తెలుసుకోవాలి. పాలసీ మీ ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ అవసరాలకు,  బడ్జెట్‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా ఉందని నిర్ధారించుకోండి. ఏదైనా సమస్య వస్తే మీ బీమా కంపెనీని ఫోన్, ఈ–మెయిల్, ఆఫీసు​ద్వారా సంప్రదించవచ్చు.  వాళ్లు చూపిన పరిష్కారంపై సంతృప్తి చెందకపోతే   https://irdai.gov.in/grievance-redressal-mechanism1 లేదా complaints@irdai.gov.inకి ఈ–మెయిల్ చేయండి. 155255 లేదా 1800 4254 732 నంబర్లకు కూడా కాల్​ చేయవచ్చు.