
బీసీసీఐ….. IPL ను వాయిదా వేసి చాలా మంచి నిర్ణయం తీసుకుందన్నారు పని చేసిందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఇండియాలో ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ ఉండటంతో… కేంద్ర ప్రభుత్వం ఇటీవల వీసాల మంజూరులో ఆంక్షలు విధించింది. దీంతో ఏప్రిల్ 15 వరకు విదేశీ ఆటగాళ్లు భారత్‌కు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో BCCI ఐపీఎల్‌ను వాయిదా వేయాలని నిర్ణయించింది. అంతేకాదు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను రద్దు చేసింది.
IPL వాయిదా వేస్తూ BCCI నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించారు సన్నీ. క్రికెట్ కంటే.. దేశ ప్రజల ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యమన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు వేలాది మంది వస్తారన్నారు. హోటల్స్‌లో, ఎయిర్‌పోర్టుల్లో అనేక మంది ఉంటారు. చాలా మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎవరైనా వైరస్ బారిన పడొచ్చు. వాళ్ల నుంచి ఇతరులకు వ్యాపించొచ్చు. ఈ క్రమంలోనే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సంతోషించదగినదన్నారు గవాస్కర్.