గద్వాల జిల్లాలో తల్లి, కూతురు మిస్సింగ్

గద్వాల జిల్లాలో తల్లి, కూతురు మిస్సింగ్

గద్వాల, వెలుగు: తల్లి, కూతురు అదృశ్యమైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు మండలం రాయపురం గ్రామానికి చెందిన మాధురికి, ధరూర్ గ్రామానికి చెందిన యుగంధర్‌‌‌‌‌‌‌‌తో పదేండ్ల కింద వివాహం కాగా, వారు బతుకుదెరువు కోసం జడ్చర్లలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం మల్దకల్‌‌‌‌‌‌‌‌లో బంధువుల శుభకార్యానికి వచ్చిన మాధురి, ఆమె కుమార్తె ఫంక్షన్ ముగిసిన తర్వాత శనివారం ఉదయం బస్సులో గద్వాలకు చేరుకున్నారు. 

గద్వాల బస్టాండ్ నుంచి తాను హైదరాబాద్ బస్సు ఎక్కానని, బస్సు కొత్తకోట దగ్గరకు వచ్చిందని, త్వరలోనే ఇంటికి చేరుకుంటానని మాధురి ఫోన్ చేసి చెప్పిన కాసేపటికే ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది. గంట తర్వాత కుటుంబ సభ్యులు మళ్లీ ప్రయత్నించినా ఫోన్ కలవకపోవడంతో ఆందోళన చెంది జడ్చర్ల పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించగా, గద్వాలలోనే ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో శనివారం ఉదయమే గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.