తల్లీ కూతుళ్లను పొడిచి చంపేశారు

తల్లీ కూతుళ్లను పొడిచి చంపేశారు

గుంటూరు: సత్తెనపల్లి పట్టణంలో  దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. మృతులు ఇద్దరూ తల్లీ కూతుళ్లుగా గుర్తించారు. నాగార్జున నగర్ లో శనివారం వెలుగులోకి వచ్చిందీ ఘటన. సొంత ఇంట్లోనే తల్లీ కూతుళ్లను పొడిచి చంపడంతో ఇళ్లంతా రక్తం ధారలై ప్రవహించింది. చనిపోయిన వారు తల్లీ కూతుళ్లు ప్రత్యూష , పద్మావతిగా గుర్తించారు. పోలం వివాదంలో హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.