రోజూ వందల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ బస్సు కండక్టర్, డ్రైవర్ స్టోరీ ఆఫ్ ది డేగా నిలిచారు ఈరోజు. కేరళ రోడ్డు రవాణా సంస్థ కేస్విప్ట్కు డిపోలో నవంబర్ 3న ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. తిరువనంతపురంలో కన్నమూల నుంచి -మెడికల్ కాలేజీ మధ్య తిరిగే బస్సులో కండక్టర్‌గా తల్లి, ఆ బస్సు డ్రైవర్‌గా ఆమె కొడుకు విధులు నిర్వహించారు. బస్సుకు డ్రైవర్ శ్రీరాగ్ కాగా, అతని తల్లి యమున దాని కండక్టర్. 2009లో ఆర్యనాడ్ డిపోలో తాత్కాలిక కండక్టర్ గా విధుల్లో చేరిన యమున 2022లో కే.స్విప్ట్కు బదిలీ అయ్యారు.
ముఖ్యమంత్రి నుంచి తొలిరోజు టికెట్ ర్యాక్ అందుకున్నప్పటి నుంచి యమున కూడా కార్పొరేషన్లో ఉద్యోగం కావాలని కలలు కంటోంది. డ్రైవింగ్ పై ఆసక్తి ఉన్న శ్రీరాగ్ తన తల్లి కలను నెరవేర్చేందుకు గతవారం కే-స్విఫ్ట్ డిపోలో డ్యూటీ చేశాడు. తల్లి కొడుకు కలిసి ఇలా ఓ బస్సును నడుపుతూ.. ప్రజలకు సేవ చేయడం భేష్ అనిపించుకున్నారు.
ఇంట్లో వండిన భోజనం ఇద్దరూ క్యారేజ్ కట్టుకొని.. డ్యూటీ బ్రేక్ లో తింటూ సంతోషంగా గడిపారు తల్లీకొడుకులు. ఆర్టీసీలో నియామకం కాకముందు శ్రీరాగ్ అటవీ శాఖలో టెంపరరీ డ్రైవర్ గా పనిచేశాడు. కండక్టర్ లైసెన్స్ ఉన్నప్పటికీ శ్రీరాగ్ మాత్రం డ్రైవర్ గా పనిచేయాలనుకున్నాడు. యమున, రాజేంద్రన్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సిద్ధార్థ్ ముత్తత్తర ఇంజినీరింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్నాడు. యమున భర్త ఆర్యనాడ్ వర్క్ షాప్ లో పని చేస్తున్నాడు. ఇలా వారి కుటుంబం సాఫీగా సాగిపోతుంది.