
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చిన కీర్తి సురేష్, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతోంది. కెరీర్ ప్రారంభంలో ఏడాదికి ఒకటి, రెండు సినిమాలే చేసినా ఆ తర్వాత చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది కూడా తన చేతిలో ఆరు సినిమాలున్నాయి. అయితే త్వరలోనే తను పెళ్లి పీటలు ఎక్కనుందనే ప్రచారం జరుగుతోంది. తన చిన్ననాటి ఫ్రెండ్‌ని ఆమె పెళ్లాడనుందని, అతనో బిజినెస్ మ్యాన్ అని, గత పదమూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
దీనిపై కీర్తి సురేష్ తల్లి, ఒకప్పటి నటి మేనక రియాక్ట్ అయ్యారు. తన కూతురు పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని, ప్రస్తుతం ఆమె తన కెరీర్‌ను మాత్రమే ప్రేమిస్తోందని, ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారామె. దీంతో ఈ రూమర్స్‌కు చెక్ పడినట్టే. నిజానికి కీర్తి విషయంలో ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇక త్వరలో నానికి జంటగా కీర్తి నటించిన ‘దసరా’ సినిమా రిలీజ్ కానుంది. చిరంజీవి ‘భోళా శంకర్’తో పాటు మరో నాలుగు తమిళ చిత్రాల్లోనూ ఆమె నటిస్తోంది.