పాలు నెయ్యి రేట్లు తగ్గించిన మథర్ డెయిరీ.. మిల్క్ షేక్స్ రేట్లు ఎంత తగ్గాయంటే?

పాలు నెయ్యి రేట్లు తగ్గించిన మథర్ డెయిరీ.. మిల్క్ షేక్స్ రేట్లు ఎంత తగ్గాయంటే?

మోడీ సర్కార్ ఇటీవల తెచ్చిన జీఎస్టీ రేట్ల మార్పులతో అనేక వస్తువుల రేట్లు తగ్గుతున్నాయి. తాజాగా మథర్ డెయిరీ పాల నుంచి నెయ్యి వరకు అనేక ఉత్పత్తులపై జీఎస్టీ మార్పులకు అనుగుణంగా రేట్ల తగ్గింపును ప్రకటించింది. పాలు, పన్నీర్, బటర్, చీజ్, నెయ్యి, మిల్క్ షేక్స్ వంటి ఉత్పత్తుల రేట్లను తగ్గించి జీఎస్టీ బెనిఫిట్స్ ప్రజలకు అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ప్యాకేజ్ సైజ్ ఆధారంగా రూ.2 నుంచి గరిష్ఠంగా రూ.30 వరకు రేట్లు తగ్గనున్నాయని వెల్లడైంది. 

కంపెనీ తన UHT టోన్డ్ ఉత్పత్తుల రేటును రూ.77 నుంచి 75కి తగ్గించింది. ఇదే సమయంలో 450 ఎంఎల్ డబుల్ టోన్డ్ UHT పాల రేటును రూ.33 నుంచి రూ.32కి తగ్గించింది. ఇక 200 గ్రాముల పనీర్ రేటు రూ.95 నుంచి రూ.92కి తగ్గించింది. 400 గ్రాముల ప్యాక్ రేటు రూ.6 తగ్గనుంది. ఇక మలయ్ పన్నీరు రేటు 200 గ్రాములకు రూ.3 తగ్గించి రూ.97వద్ద ఫిక్స్ చేసింది. ఇదే సమయంలో 500 గ్రాముల బటర్ ప్యాకెట్ రేటు రూ.305 నుంచి రూ.285కి తగ్గించింది.

Also Read:-కొత్త రికార్డులకు చేరిన గోల్డ్ సిల్వర్.. మంగళవారం పెరిగిన రేట్లివే..

ఇక కంపెనీ తన చీజ్ క్యూబ్స్ 180 గ్రాముల రేటును రూ.145 నుంచి రూ.135కి తగ్గించింది. అలాగే 180 గ్రాముల చీజ్ స్పెడ్ రేటును రూ.110కి తగ్గించింది. ఇక పోతే మిల్క్ షేక్స్ 180 ఎంఎల్ ప్యాక్ రూ.30 నుంచి రూ.28కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇక చివరిగా లీటరు నెయ్యి ప్యాక్ రేటు రూ.675 నుంచి రూ.645కి తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో మథర్ డెయిరీ మెుత్తం బిజినెస్ టర్నోవర్ రూ.17వేల 500 కోట్లుగా నమోదైంది.