విశాఖలో విషాదం... బిడ్డను హత్య చేసిన తల్లి

V6 Velugu Posted on Nov 28, 2021

విశాఖలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లే ఓ బిడ్డను హత్య చేసింది. నీటి డ్రమ్ములో పడేసి ప్రాణం తీసింది. ఈ దుర్ఘటన జిల్లాలోని కసింకోట మండలం ఏఎస్ పేటలో జరిగింది. పేటకు చెందిన అప్పలరాజుకు గొండుపాలెం గ్రామానికి చెందిన సంధ్య అనే యువతితో గతేడాది నవంబర్​లో వివాహమైంది. వీరికి మగ బిడ్డ జన్మించాడు. భార్యభర్తలిద్దరూ... అచ్యుతాపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. శుక్రవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చారు. భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. 

రాత్రి పది గంటల సమయంలో బాబు ఏడిస్తే సంధ్య పిల్లాడికి పాలు పట్టింది. అనంతరం అందరూ నిద్రపోతున్న సమయంలో శిశువును నీటి డ్రమ్ములో పడేసి హత్య చేసింది. అర్ధరాత్రి సమయంలో శిశువు కనిపించకపోవడంతో అప్పలరాజు బాబు కోసం వెతికాడు. అయితే సంధ్యను అడిగితే పొంతన లేని సమాధానం చెప్పడంతో ఇంటి చుట్టుపక్కలా వెతికాడు. ఫలితం లేకపోవడంలో 100 నంబర్​కు ఫోన్ చేశాడు. తండ్రి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు... సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి సమీపంలో గాలింపు చేపట్టగా నీటి డ్రమ్ములో శిశువు మృతదేహం లభించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

Tagged mother killed child, visakhapatnam, vizag crime, ap crime

Latest Videos

Subscribe Now

More News