కొడుకా నిన్ను పెంచలేకపోతున్నా: డిప్రెషన్​తో తల్లి ఆత్మహత్య

కొడుకా నిన్ను పెంచలేకపోతున్నా: డిప్రెషన్​తో తల్లి ఆత్మహత్య

చందానగర్​, వెలుగు : ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తన 10 నెలల కొడుకుతోనే కాలం గడిచిపోయేది. పిల్లవాడి స్నానం, బట్టలు మార్చడం, అన్నం తినిపించడం, డైపర్స్​ మార్చడం ఇలా అందరు తల్లులు చేసే పనే తనూ చేసింది. కానీ ఈ పనులతోనే ఆమె డిప్రెషన్​లోకి వెళ్లిపోయింది. భర్త గుర్తించి పుట్టింటికి పంపించినా తిరిగివచ్చాక మళ్లీ అదే పనులతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లోని చందానగర్​లో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అనుభవ్​ చిత్రేయ్​, ప్రియాంక శ్రీవాత్సవ్(30) భార్యా భర్తలు.వీరికి పది నెలల బాబు శషీల్​ఉన్నాడు.

వీరు చందానగర్​లోని అపర్ణ లేక్​ బ్రీజ్​అపార్ట్​మెంట్​లోని 11 వ ఫ్లోర్​లో ఉంటున్నారు. అనుభవ్​ డెలాయిట్​లో సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్. ​ కొద్దిరోజులుగా  ప్రియాంక తన కొడుకు పెంపకం విషయంలో ఒత్తిడికి గురవుతోంది. గమనించిన భర్త  నెల పాటు ప్రియాంకను పుట్టింటికి పంపించాడు. ఈ నెల 14న తిరిగి నగరానికి వచ్చింది. మళ్లీ అవే పనులు మొదలవడంతో బుధవారం 11వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని ఎస్​ఐ శ్యాంప్రసాద్ తెలిపారు.

for more news….

వచ్చి చాయ్‌‌ తాగి పోండి కానీ పైసల్​ అడగొద్దంటున్న కేసీఆర్ సారూ
కొడుకా నిన్ను పెంచలేకపోతున్నా: డిప్రెషన్​తో తల్లి ఆత్మహత్య
సెల్‌కు దగ్గరగా.. వైఫ్‌కు దూరంగా… భర్తలపై భార్యల కంప్లయింట్