పొదల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డ.. శిశువిహార్ కు తరలింపు

పొదల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డ.. శిశువిహార్ కు తరలింపు

రంగారెడ్డి జిల్లాలో అప్పుడే పుట్టిన ఓ మగబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వెళ్లిపోయారు. చంటిబిడ్డ ఏడుపు విన్న స్థానికులు దగ్గరకు వెళ్లి చూసేసరికి గుక్కపెట్టి ఏడ్వడం చూసి.. ప్రత్యక్ష సాక్షులు చలించిపోయారు. బాబును హైదరాబాద్ లోని శిశువిహార్ కు తరలించారు.  

అసలేం జరిగిందంటే..?

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం విట్యాల గ్రామ శివారులో ఓ పసికందుని వదిలి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ హృదయ విదారకమైన దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. స్థానికులు అటుగా వెళుతుండగా ఆ చిన్నారి బిగ్గరగా ఏడ్వడాన్ని గమనించారు. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి చూడగా... చంటి బిడ్డ ముళ్ల పొదల్లో ఏడుస్తూ కనిపించింది. వెంటనే దగ్గరకు తీసుకుని పాలు పట్టించారు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పసికందుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. మగబిడ్డను హైదరాబాద్ శిశు విహార్ కు తరలించారు. బాబు కాలుపై మిస్బా సన్ అఫ్ అమీర్ అనే ట్యాగ్ ను గుర్తించారు. 

అయితే.. అప్పుడే పుట్టిన మగబిడ్డను ఎవరు వదిలి ఉంటారనే దానిపై అనేక అనుమానాలు కల్గుతున్నాయి. కన్నతల్లే ఈ పని చేసిందా..? లేక ఇంకా ఎవరైనా చేశారా..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.