
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఈ మధ్య మొదటిసారి బిడ్డతో మీడియా ముందుకొచ్చింది. ‘మీ బెటర్ హాఫ్ ఎక్కడ?’, ‘ఆ బిడ్డకి తండ్రి ఎవరు?’ అనే ప్రశ్నలు ఎదురయ్యాయి ఆమెకు. ‘ఇలాంటి అర్థం లేని ప్రశ్నలు మహిళల క్యారెక్టర్‌కి మచ్చ తెస్తాయి. తండ్రి ఎవరనేది ఆ తండ్రికి తెలుసు’ అని ఘాటుగానే చెప్పింది నుష్రత్. సింగిల్ పేరెంట్‌గా ఉన్న మహిళలకు ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎదురవుతుంటాయి. ‘సంతోషంగా లేని రిలేషన్షిప్లో కొనసాగడం కంటే జీవితాంతం సింగిల్ మదర్‌గా ఉండడం బెటర్’ అంటున్న సింగిల్ మదర్స్ బిడ్డల బాధ్యత, కెరీర్... రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తాము బలహీనులం కాదని, తమ ఛాయిస్‌ని రెస్పెక్ట్ చేయాలని అంటున్నారు. భర్త నుంచి వేరుగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాక దాని గురించి సింగిల్ మదర్స్ ఎప్పుడూ బాధపడొద్దు. అప్పుడే మనల్ని మెంటల్‌గా, ఎమోషనల్‌గా బయటివాళ్లు డిస్టర్బ్ చేయలేరు. ఇంట్లో ఉన్నా, ఆఫీసుకి వెళ్లినా కూడా పిల్లల అవసరాలు చాలావరకు తల్లులే చూసుకుంటారు. సింగిల్ మదర్స్‌ని సమాజం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే వాళ్లు స్ట్రాంగ్ అవుతారు. తమ కాళ్ల మీద తాము నిలబడతారు అంటున్నారు ఎక్స్పర్ట్స్.