అమ్మకు గుడికట్టి సేవలు చేస్తున్నాడు

అమ్మకు గుడికట్టి సేవలు చేస్తున్నాడు

అమ్మను మించిన దైవమున్నదా అనే పదానికి నిదర్శనంగా నిలిచాడు ఓ వ్యక్తి.  నవ మాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లి రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేనిది. అలాంటి తల్లి అనారోగ్యంతో కన్ను మూస్తే గుడి కట్టించి పూజలు చేస్తున్నాడో కొడుకు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందిన సాగర్‌ కుటుంబం కోసం తల్లి చేసిన త్యాగాలను గుర్తుంచుకునేలా ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. అమ్మను స్మరించుకుంటూ పేదలకు సేవలు చేస్తున్నాడు. రోజూ కుటుంబీకులతో కలిసి అక్కడే గడుపుతున్నాడు. ఎంత చేసినా అమ్మ రుణం తీర్చుకోలేమని తెలుపుతూ గ్రామస్థులకు తల్లి ప్రేమను వివరిస్తున్నాడు సాగర్‌. నేడు మాతృదినోత్సవం సందర్భంగా సాగర్ చేసే ఈ మంచి పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.