బషీర్‌బాగ్,వెలుగు : మాదిగలను రాజ్యాధికార దిశగా తీసుకెళ్లేందుకు మాదిగ మహా శక్తి సంఘం కృషి చేస్తుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మాదిగ మహా శక్తి జెండా ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ మాదిగలు ఐక్యంగా లేకపోవడం వల్లే రాజకీయంగా అన్యాయానికి గురవుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ మాదిగలను చైతన్యపరుస్తానని, రానున్న ఎన్నికల్లో మాదిగలను బలమైన రాజకీయ శక్తిగా మారుస్తామని స్పష్టం చేశారు.
