అంబేద్కర్ కు నిజమైన వారసుడు కేసీఆర్

అంబేద్కర్ కు నిజమైన వారసుడు కేసీఆర్

బలుపెక్కి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ను బీజేపీ మోయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు మోత్కుపల్లి నర్సింలు. ఇవాళ(శుక్రవారం) బీజేపీకి రాజీనామా చేసిన మోత్కుపల్లి.. ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అవమానాలు బరించలేకనే బీజేపీకి రాజీనామా చేస్తున్నానన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఏ నాయకుడు బీజేపీలో సంతృప్తిగా లేరన్నారు.30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న తనను పార్టీ సమావేశాల్లో వేదిక కింద కూర్చో పెడుతున్నారన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి.. అంబేద్కర్‌ కు నిజమైన వారసుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.  దళితులకు పది లక్షలు ఇస్తున్న ఏకైక మగాడు కేసీఆరేనన్నారు. రాష్ట్రంలోని దళితులందరూ కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు.అవినీతిపరుడైన ఈటల రాజేందర్ ను హుజురాబాద్ ప్రజలు బహిష్కరించాలన్నారు. దళిత, దేవలయాల భూములను వెనక్కి ఇప్పించి బీజేపీలో చేర్చుకుంటే బాగుండేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి దళిత సాధికారత సమావేశానికి ఆహ్వినిస్తే వెళ్తే తప్పేంటన్నారు. చరిత్రాత్మకమైన దళిత సాధికారత సమావేశానికి హాజరుకాకుండా బీజేపీ చారిత్రాత్మకమైన తప్పుచేసిందన్నారు.