హైదరాబాద్‌‌లో మోటార్ రేసింగ్ వరల్డ్ కప్‌‌ ఫైనల్

హైదరాబాద్‌‌లో మోటార్ రేసింగ్ వరల్డ్ కప్‌‌ ఫైనల్

హైదరాబాద్‌‌, వెలుగు: ఫార్ములా–ఈ రేస్‌‌కు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్‌‌లో దేశంలోనే  తొలిసారిగా ఎలక్ట్రిక్ మోటార్ రేసింగ్ ఈవెంట్ ఎఫ్‌‌ఐఎం ఈ–ఎక్స్‌‌ప్లోరర్ వరల్డ్ కప్‌‌ పోటీలు జరగనున్నాయి. ఈ –ఎక్స్‌‌ప్లోరర్ వరల్డ్ కప్‌‌ రెండో సీజన్‌‌ ఫైనల్‌‌ రేస్  నవంబర్ 29–డిసెంబర్1 తేదీల్లో  హైదాబాద్‌‌లో జరగనుంది. ఈ మేరకు ఈ ఎక్స్‌‌ప్లోరర్ రెండో సీజన్‌‌ క్యాలెండర్‌‌‌‌  ఖరారైంది.

జపాన్‌‌లోని ఒసాకాలో ఈ నెల 16,17వ తేదీల్లో జరిగే తొలి రౌండ్‌‌తో ఈ సీజన్‌‌ షురూ అవుతుంది. రెండో రౌండ్‌‌ నార్వే (మే3,4), మూడో రౌండ్ ఫ్రాన్స్‌‌ (జూన్ 21–23), నాలుగో రౌండ్ స్విట్జర్లాండ్ (సెప్టెంబర్ 20–22)లో జరుగుతాయి. ఇండియాలో రేసులు నిర్వహించేందుకు ఎఫ్‌‌ఐఎం ఈ– ఎక్స్‌‌ప్లోరర్‌‌తో  తొమ్మిదేండ్ల ఒప్పందంలో భాగంగా కంకణాల స్పోర్ట్స్‌‌ ‌‌గ్రూప్‌‌లో హైదరాబాద్‌‌లో ప్రత్యేక ట్రాక్‌‌ను ఏర్పాటు చేస్తుంది. అదే గ్రూప్‌‌కు చెందిన ‘ఇండీ రేసింగ్’ టీమ్ రెండో సీజన్‌‌లో పోటీ పడనుంది.