కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ పరిధిలోని జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైక్నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైవేపైనే వాహనం పూర్తిగా దగ్ధమవడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెల్లాపూర్కు చెందిన మహమ్మద్రిజ్వాన్ బైక్పై కూకట్పల్లి నుంచి మియాపూర్వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్సర్క్యూట్కారణంగానే మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
