పీఆర్సీపై నెలాఖరులోగా తేల్చకపోతే ఉద్యమం

పీఆర్సీపై నెలాఖరులోగా తేల్చకపోతే ఉద్యమం
  • సర్కారుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ అల్టిమేటం
  • లేకుంటే ఫిబ్రవరిలో పోరాటాలు ఉదృతం చేస్తం
  • ధర్నాచౌక్‌లో జేఏసీ దీక్షకు పర్మిషన్ ఇవ్వని పోలీసులు
  • రోడ్డుపై బైఠాయించిన నేతలు, పలువురి అరెస్టు
  • పోలీస్‌స్టేషన్‌లోనూ దీక్ష కొనసాగించిన నేతలు

హైదరాబాద్, వెలుగు: పీఆర్సీపై ఈ నెలాఖరులోగా తేల్చాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల, పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సర్కారుకు అల్టిమేటం ఇచ్చింది. లేకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఇందిరాపార్క్‌‌ ధర్నాచౌక్‌‌లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం నిరాహార దీక్ష చేయాలని టీచర్లు, ఎంప్లాయీస్‌‌ నిర్ణయం తీసుకున్నా.. పోలీసులు దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఉదయం 10 గంటల నుంచే భారీగా పోలీసులను మోహరించారు. దీక్షకు అనుమతి లేదని టీచర్లు, ఎంప్లాయీస్​ను అక్కడ నుంచి పంపేశారు. యూటీఎఫ్ ఆఫీస్​నుంచి ర్యాలీగా వచ్చిన ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులను ధర్నాచౌక్ చౌరస్తా​ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేవలం వంద మందితోనే దీక్ష చేస్తామని చెప్పినా, పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో.. జేఏసీ నేతలు అక్కడే బైఠాయించారు. పోలీసులు, జేఏసీ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో వారిని అరెస్ట్ చేసి గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి తదితర పోలీస్​స్టేషన్లకు తరలించారు. పోలీస్​స్టేషన్‌‌లోనూ నేతలు దీక్ష కొనసాగించారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ నేతలు సంపత్​కుమార్ స్వామి(టీఈఏ), సదానందంగౌడ్ (ఎస్టీయూ), లక్ష్మయ్య (పింఛనర్స్​జేఏసీ), చావ రవి (యూటీఎఫ్​) మాట్లాడారు. పీఆర్సీ రిపోర్టును పబ్లిక్ డొమైన్‌‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులోగా అన్ని సంఘాలతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్‌‌మెంట్‌‌తో 2018 జులై1 నుంచి కొత్త వేతనాలు అమలు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జేఏసీ స్టీరింగ్ కమిటీ నేతలు మైస శ్రీనివాసులు(టీపీటీఎఫ్​), కె.కృష్ణుడు(బీసీటీఏ), రాధాకృష్ణ(టీపీటీయూ), జంగయ్య(టీఎస్​యూటీఎఫ్​), రఘుశంకర్​రెడ్డి(డీటీఎఫ్), చెన్న రాములు(టీఎస్పీటీఏ), మహిపాల్​రెడ్డి(ఎస్జీటీయూ), పోచయ్య, కృష్ణమూర్తి, మధుసూధన్​రెడ్డి, కైలాసం, గంగాధర్, డీవీరావు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి కలెక్టరేట్‌‌ వద్ద ఆందోళన

పోలీసుల అరెస్టుకు నిరసనగా రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తొమ్మిది లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్లకు.. పీఆర్సీ, డీఏల సాధనకు ఐక్యవేదిక పోరాటం చేస్తోందన్నారు. కానీ ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేస్తూ కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులను అడ్డుపెట్టుకొని టైం వేస్ట్‌‌ చేస్తూ అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారు ఇకనైనా స్పందించి పీఆర్సీ, డీఏ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

For More News..

పొలంలో రైతు సత్యాగ్రహ దీక్ష

ఆ ఆరుగురు ప్లేయర్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్​

బంపర్ ఆఫర్.. వేయి రూపాయలుంటే విమానం ఎక్కొచ్చు