ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మంచు రంగస్వామి నాయుడు ఇవాళ( బుధవారం)తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను తిరుపతిలోని ఓ ప్రైవేట్ తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మరణంతో మోహన్ బాబు కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. రేపు(గురువారం) తిరుపతిలోని గోవింద ధామం దగ్గర రంగస్వామి నాయుడి అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
