
హైదరాబాద్: నగరంలోని నీటి వనరులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్న హైడ్రాకు తన ఎంపీ కోటా నిధుల నుంచి రూ. 25 లక్షలు అందజేశారు రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచి అధికారిగా పేరున్న రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌గా నియమించారని అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ నగరంలోని చెరువుల కబ్జాను కాపాడలేక పోయారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. హైడ్రా రాజకీయాల కోసం కాదని అభివృద్ధి కోసమని అన్నారు. దేశంలోని అనేక నగరాల్లో నీటి కొరత ఏర్పడుతోందని, అలాంటి ఇబ్బంది రావద్దనే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. హైడ్రాను జిల్లాల్లోనూ అమలు చేయాలని వినతులు వస్తున్నాయని అన్నారు. జిల్లాలకు హైడ్రా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.