నా ప్రాణం తియ్యడానికి పోలీసులు ప్లాన్ చేశారు

V6 Velugu Posted on Jan 26, 2022

మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లో.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ సీపీ పర్యవేక్షణలోనే తనపై దాడి జరిగిందని ఆరోపించారు ఎంపీ ధర్మపురి అర్వింద్. మొన్న సాయంత్రమే సీపీకి ఫోన్ చేసి దాడి జరిగే అవకాశముందని చెప్పినా.. భద్రత కల్పించలేదన్నారు. నా ప్రాణం తియ్యడానికి పోలీసులు ప్లాన్ చేశారని ఆరోపించారు.కలెక్టర్ కు ఫోన్ చేసినా స్పందన కరువైందన్నారు. దాడి జరిగిన ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పారు అర్వింద్. హైదరాబాద్ నుంచి 25 మంది ఆయుధాలతో నిజామాబాద్ వచ్చారని ఆరోపించారు. నా ప్రాణం కాపాడినందుకు నా కార్యకర్తలకు ధన్యవాదాలు అని అన్నారు.

పోలీస్ కమిషనర్ నియామకం అయినప్పటి నుంచి కలిసేందుకు ప్రయత్నం చేస్తే సమయం ఇవ్వలేదని ఆరోపించారు ఎంపీ అర్వింద్. పసుపు రైతుల పేరుమీద అడ్డుకునే కుట్ర చేశారన్నారు. నిన్నటి ఘర్షణకు మాకు సంబంధం లేదని పసుపురైతు ఐక్య వేదిక ప్రకటన విడుదల చేసిందన్నారు. దాడికి పాల్పడింది రాము, మ్యూనిరుద్దీన్ అని చెప్పారు. ముస్లిం ప్రజలు పసుపు ఎప్పటినుంచి పండిస్తున్నారో నాకైతే సమాచారం లేదని.. దాడి జరిగిన స్థలంలో టీఆరెస్ ఎంపిటిసిలు, సర్పంచ్ లు, కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. ఆర్ముర్ ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెనుకుండి నడిపిస్తున్నాడని చెప్పారు. మాపై దాడి జరుగుతుందని కమిషనర్ కు మేము ముందే సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అర్వింద్.

మరిన్ని వార్తల కోసం...

తెలంగాణలో నియంత పాలన సాగుతోంది

Tagged MP Arvind, alleged, police planned, take my life

Latest Videos

Subscribe Now

More News