తెలంగాణలో నియంత పాలన సాగుతోంది

తెలంగాణలో నియంత పాలన సాగుతోంది

ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మన రాజ్యాంగం నిలిచిందన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. బ్యాంకుల జాతీయకరణ చేసి ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అందించిందన్నారు. కానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ఒక సామంత రాజు లాగా పాలన చేస్తున్నారని ఆరోపించారు.  ఉద్యమకారులు నిరుద్యోగులు, మేథావులు మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు పాలకులను కలిసి వినతి పత్రం ఇద్దామంటే సచివాలయం కూడా లేదని విమర్శించారు. నెరేళ్ల లో ఇసుక మాఫియా ను వ్యతిరేకిస్తే యువకులను థర్డ్ డిగ్రీతో దారుణంగా కొట్టి హింసించడంపై మండిపడ్డారు. ఖమ్మంలో మిరప రైతులు గిట్టుబాటు ధరలు ఉద్యమిస్తే కేసులు పెట్టి దొంగల్లాగా జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలంలో ఆదివాసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అనాగరిక పాలనకు అద్దం పడుతుందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు, యువకులు ప్రజలకు అండగా ఉండాలని..వారి హక్కులను సాధించేందుకు మద్దతుగా ఉద్యమాలు చెయ్యాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం 

హైకోర్టులో ఘనంగా గణతంత్ర వేడుకలు 

టీఆర్ఎస్ దాడులపై బండి సంజయ్ సీరియస్