నిజామాబాద్లోని 9 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీదే విజయం

నిజామాబాద్లోని  9 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీదే విజయం

9 ఏళ్ల మోదీ పాలనలో దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఎంపీ అర్వింద్ అన్నారు. మూడోసారి మోదీని ప్రధానిని చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పార్టీకోసం పని చేయాలని సూచించారు. బీఆర్ఎస్ తో యుద్దానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటులో యుద్ధ వాతావరణం ఉంటుందని ఎంపీ అర్వింద్  అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 9 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మీడియా, కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ చేతిలో పెట్టుకున్నారని ఎంపీ అర్వింద్ విమర్శించారు.