ఎమ్మెల్యే బాజిరెడ్డి ఒత్తిడితో కేసును ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు

ఎమ్మెల్యే బాజిరెడ్డి ఒత్తిడితో కేసును ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు

నిజామాబాద్: నెల రోజుల క్రితం అనుమాన‌స్ప‌ద స్థితిలో హ‌త్య‌కు గురైన‌ సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన‌ మమత హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని ఎంపీ అర్వింద్ అన్నారు.నిజామాబాద్ న‌గరంలో శుక్ర‌వారం మృతురాలికి న్యాయం జ‌ర‌గాలంటూ న్యావనంది గ్రామస్థులు ధర్నా చౌక్ నుంచి సీపీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అర్వింద్.. నిందితులను గుర్తించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. విచారణను పక్కదారి పట్టిస్తున్నారని , గ్రామస్థులు అనుమానించిన వ్యక్తులను విచారించడంలో తాత్సారం చేస్తున్నారన్నారు. ఈ కేసు విష‌యంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోలిసులను ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు