హరీశ్ రావు గ్యాస్ సిలిండర్ గుర్తుకు ప్రచారం చేస్తున్నాడు

హరీశ్ రావు గ్యాస్ సిలిండర్ గుర్తుకు ప్రచారం చేస్తున్నాడు

కరీంనగర్: వీణవంక మండలం మామిడాలపల్లిలో హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ఎంపీ అర్వింద్ ప్రచారం చేశారు. కేసీఆర్ మరో పదేళ్లు ఉంటే.. రాష్ట్రంలో వరి పూర్తిగా బంద్ అవుతుందని ఆయన అన్నారు. మంత్రి హరీశ్ రావు గ్యాస్ సిలిండర్ గుర్తు కలిగిన వ్యక్తికి ప్రచారం చేస్తున్నాడని అర్వింద్ అన్నారు. 

‘రెండు కోట్ల టన్నుల వరి తెలంగాణలో పండితే క్వింటాలుకు 400 రూపాయల చొప్పున బ్లాక్ మార్కెట్‎కు వెళ్తున్నాయి. ఆ సొమ్మంతా ఎక్కడికి పోతోంది. ఇవన్నీ లెక్కలేసుకుని ఇతర పంటలు తగ్గించాడు. వరి ప్రోత్సహించి.. దానిపై దందా తీశాడు. రైసుమిల్లర్లు రైతుల నుంచి 10 నుంచి 15 శాతం తరుగు తీస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. కొత్త రైతు చట్టాలని ఆపాలని చూస్తున్నది ఇందుకే. ఎక్కడైనా అమ్ముకునే వీలు రాకూడదని చూస్తున్నారు. కొత్త రైతుచట్టాలు వస్తే మీ దగ్గరకు షావుకారు వచ్చి మీ పొలం దగ్గరే కొనుక్కు పోతాడు. అప్పుడు మీరు కొనుగోళ్ల కోసం ఎదురు చూడాల్సిన పని ఉండదు. కానీ వీళ్ల బ్లాక్ మార్కెట్ దందాకు అడ్డం వస్తుందనే రైతు చట్టాలు వద్దంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టినట్లు. మోడీ గుజరాత్‎లో ఇంకుడు గుంతలు, 1.6 లక్షల చెక్ డ్యాంలు కట్టించి భూగర్భ జలాలు పెంచాడు. అదేవిధంగా 24 గంటలు కరెంట్ ఇచ్చాడు. దీంతో గుజరాత్ రైతుల ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. ఆ రాష్ట్ర ఆదాయం 9 వేల కోట్లనుంచి 40 వేల కోట్లకు పెరిగింది. రూపాయి అప్పు చేయకుండా మోడీ ఇవన్నీ చేశాడు. కేసీఆర్ లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టాడు. అయినా మూడేళ్లుగా వర్షాలు పడి.. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. తన కుటుంబానికి లక్ష కోట్లు దోచి పెట్టడానికే ఈ ప్రాజెక్టు కట్టాడు. రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పులు పాలు చేశాడు. భూగర్భ జలాలు పెంచితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 

ఇంటింటికి మంచినీళ్లు  ఇస్తామని కొంగరకలాన్ మీటింగ్‎లో చెప్పాడు. ఇప్పటి వరకు తాగునీరు రాలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి ఎవరైనా వెళ్తున్నారా? గృహ ప్రవేశానికి నన్నుపిలవండి. ఎక్కడా డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్ట లేదు. రెండు రోజుల క్రితం ఎన్నికల కమిషన్ దళిత బంధు ఆపింది. కానీ దళితుల అకౌంట్లు నెల రోజుల కిందటే ఫ్రీజ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఉండాలన్నాడట.. కానీ ఇస్తననలేదట. అదేవిధంగా దళితుల అకౌంట్లో పదిలక్షలు ఉంటాయట.. కానీ ఇస్తానని అనలేదట. మీకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఉండాలన్నాడు కానీ.. ఆయన కట్టిస్తానని అనలేదట. మీరు నమ్మి ఓటేశారు. ఇకపై కారు గుర్తుకు వేయకండి. దేశవ్యాప్తంగా మోడీ 3 కోట్ల ఇండ్లు కట్టించాడు. ఇంకా కట్టిస్తూనే ఉన్నాడు. ఇతర రాష్ట్రాల్లో అందరూ కేంద్రం ఇచ్చిన 2 లక్షలతో ఇండ్లు కట్టిస్తున్నారు. 
కరోనా కాలంలో ఆయుష్మాన్ భారత్ కింద అన్ని రాష్ట్రాల్లో ఐదు లక్షలు వైద్య ఖర్చులకు ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదు.  ఏమన్నా అంటే 2 వేల ఫించను ఇస్తున్నా అంటున్నాడు. కుండలు పెట్టి.. బిందెలు ఎత్తుకు పోతున్నాడు. ఇటువంటోన్ని ఓడగొట్టి బుద్ది చెప్పాలి. 

ఎక్కడ ఓడిపోతే అక్కడికి హరీశ్ రావును పంపిస్తారు. ఈ ఫకీరు గాడు గ్యాస్ సిలిండర్ పెట్టుకు తిరుగుతున్నాడు. మరో వ్యక్తికి గ్యాస్ సిలిండర్ గుర్తు ఉంది. వాళ్ల కోసం ప్రచారం చేస్తున్నావా? నీవు ఎవరి చెవిలో పువ్వుపెడుతున్నావు. గ్యాస్ మీద వచ్చే పన్నులో కేంద్రానికి, రాష్ట్రానికి సగం సగం వస్తాయి. మీ మామకు చెప్పి గ్యాస్‎తో పాటు.. పెట్రోలు, డీజిల్ పై కూడా మీ పన్ను తగ్గించమని చెప్పు. మేం కూడా ఐదు శాతం తగ్గించమని మోడీకి చెబుతాం. కేసీఆర్ ఫామ్ హౌస్‎లో పడుకుని వీళ్లను నమ్మితే.. వీళ్లంతా కలిసి ఆ ముసలోన్ని ఏమో చేసేటట్టే ఉన్నారు. కేసీఆర్ ఇంకా ఉంటే.. మరో పదేళ్లలో వ్యవసాయం బంద్ అవుతుంది. వరి మీద లక్షల కోట్ల లూఠీ జరుగుతోంది. ఇప్పుడేమో వరి వేస్తే ఉరి అంటున్నాడు. బీజేపీ కండువా వేసుకుంటే పోలీసులు బెదిరిస్తున్నారట. మిమ్మల్ని అడ్జం పెట్టుకుని రాజ్యం ఏలాలనుకుంటున్నాడు. పోలీసు స్టేషన్ల నిర్వహణకు మొదట్లో ఇచ్చిన మెయింటెన్స్ ఇప్పుడు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. మూడెకరాల భూమి, డబుల్  బెడ్ రూం, లక్ష రూపాయల రుణమాఫీ వంటివి మ్యానిఫెస్టోలో పెట్టి కూడా ఇవ్వలేదు. ఆ మ్యానిఫెస్టో మోరీలో వేయాలి. ఈటల రాజేందర్‎ను గెలిపిస్తే.. కేసీఆర్‎కు బుద్ధి, సోయి వచ్చి.. చేసిన వాగ్ధానాలు గుర్తుకు వస్తాయి. అందుకే ఈటల రాజేందర్‎ను గెలిపించాలి’ అని ఎంపీ అర్వింద్ అన్నారు.

For More News..

మొత్తం అమ్మి అయినా కేసీఆర్‎ను వదిలిపెట్టకన్నది

సీఎంలకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు