ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే రాష్ట్రం తెలంగాణ

ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే రాష్ట్రం తెలంగాణ

కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. దేశంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారని వాపోయారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆదిలాబాద్ నుంచి అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. 

కేటీఆర్ ఓటీటీ సినిమాలకు బదులు ఇంట్లో కూర్చొని వరదలపై సమీక్ష చేయవచ్చు కదా అని అర్వింద్ సూచించారు. కేంద్ర బృందం వచ్చి రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసినా కేసీఆర్ మాత్రం ఇంటి నుంచి బయట అడుగుపెట్టడంలేదని విమర్శించారు. ఉట్నూరులో ట్రైబల్ యూనివర్సిటీని కేంద్రం ఇస్తామని ప్రకటించినా కనీసం స్థలం ఇవ్వలేదని అర్వింద్ ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయిలో జోడేఘాట్ కొమురం భీం స్మృతి వనం ఏమైందని ప్రశ్నించారు.

రైతు బంధు డబ్బులు అన్నదాతలు తీసుకోకుండా రాష్ట్రంలో 2.5 లక్షల అకౌంట్లు ఫ్రీజ్ చేయించారని అర్వింద్ ఆరోపించారు. ప్రభుత్వ స్కూల్స్లో అడుగుపెట్టే పరిస్థితి లేదని అన్నారు. కేంద్రం విద్య కోసం రూ.9,700 కోట్ల నిధులతో పాటు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు డైవర్ట్ చేశారని ఆరోపించారు.