
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని కాంగ్రెస్ నేత జి.నిరంజన్ పేర్కొన్నారు. ఇదిఈసీ నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు ఈ- మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జనవరి 5న ఎన్నికల కమిషన్ ప్రచురించిన తుది ఓటరు జాబితాలో ఈ విషయం బహిర్గతమైందన్నారు.
ఓటరు జాబితాలో వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓటు హక్కు ఉండగా.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ ఆయనకు మరో ఓటు కలిగి ఉన్నారని నిరంజన్ తెలిపారు. బాధ్యతాయుతమైన లోక్‌సభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి రెండు వేర్వేరు చోట్ల ఓట్లు కలిగి ఉన్నారంటే.. ఎన్నికల యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టమవుతుందన్నారు. ఈ ఫిర్యాదుకు ఎన్నికల సంఘం వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న నియోజకవర్గాల ఓటరు జాబితాను కూడా జత చేశారు