అవినాష్ రెడ్డి  బెయిల్  పిటిషన్ లో ఏముందంటే

అవినాష్ రెడ్డి  బెయిల్  పిటిషన్ లో ఏముందంటే

మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.  వివేకా హత్యకు మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాలే కారణమంటూ ఆయన ముందస్తు బెయిల్  పిటిషన్ లో పేర్కొన్నారు.  అయితే A 2 సునీల్ యాదవ్ తల్లితో పాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతో కూడా వివేకాకు సంబంధం ఉన్నట్లుగా ఆరోపించారు. ఈకేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  

తనకు గతంలో 161CRPC కింద సీబీఐ అధికారులు తనని విచారించారని ఇప్పుడు 160కింద నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. తనపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి  అధారాలు లేవని కోర్టకు తెలిపారు. ఈ పిటిషన్ ను ఆ రోజు  మధ్యాహ్నం కోర్టు విచారించనుంది. 

 ఏప్రిల్ 17 సోమవారం రోజున మధ్యాహ్నం 03 గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపింది.   గతంలోనాలుగుసార్లు అవినాష్ రెడ్డిని సైతం సీబీఐ విచారించింది. జనవరి 28 , ఫిబ్రవరి 24, మార్చ్ 10, మార్చ్ 14 తేదీల్లో అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ ఏప్రిల్ 17న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది.  

దీంతో అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.  అవినాష్‌ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు, కేడర్ కూడా బయల్దేరారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరవుతున్నారు. సీబీఐ గతంలో మాదిరిగానే అవినాష్ విచారణ సమయంలో వీడియోలు, ఆడియో‌లు రికార్డ్ చేయనున్నారు.