ఓన్లీ పొలిటికల్ పంచ్ లే..బాక్సింగ్ పంచ్ లు రావు

ఓన్లీ పొలిటికల్ పంచ్ లే..బాక్సింగ్ పంచ్ లు రావు

తనకు పొలిటికల్ పంచులు తప్ప బాక్సింగ్ పంచులు రావన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్.  కరీంనగర్ లో అంబేద్కర్ స్టేడియంలో జాతీయ స్థాయి బాలబాలికల కిక్ బాక్సింగ్ పోటీలను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ  కార్యక్రమానికి పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ సంజయ్ బాక్సింగ్ ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుందన్నారు. ప్రధానమంత్రి ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది క్రీడలను ప్రోత్సహించేందుకే అని అన్నారు. చదువులు, క్రీడలు స్వార్థానికి ఉపయోగించుకోవద్దని సూచించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతిపాదనలు పంపించామని అన్నారు ఎంపీ.