కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ ఏందో చూపిస్తం : బండి సంజయ్

కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ ఏందో చూపిస్తం : బండి సంజయ్

రోడ్డు మీద కుక్క చనిపోయినా అయ్యే అంటాం..అలాంటిది ఆర్టీసీ కార్మికులు చనిపోతున్నా సీఎం రాకపోవడంకాదుకదా..కనీసం కనికరంలేకుండా వ్యవహారించడం దారుణమన్నారు ఎంపీ బండి సంజయ్. శుక్రవారం కరీంనగర్ లో బాబు అంత్యక్రియల్లో భాగంగా మాట్లాడిన ఆయన..సీఎం చేసిన వ్యాఖ్యలతో ఆందోళన చెందిన డ్రైవర్ బాబు జేఏసీ సభలో బాబు చనిపోవడం దారుణమన్నారు. మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి చలిస్తున్నా..ముఖ్యమంత్రికి జాలి కలగడంలేదన్నారు. హుజూర్ నగర్ లో ఆర్టీసీ డీపోలేకపోవడంతోనే సీఎం కేసీఆర్ బతికిపోయాడని..సభకు అడ్డదారుల్లో వెళ్లారని తెలిపారు.

బిడ్డా కేసీఆర్ ఇవ్వాళ బాబు చనిపోయాడు. మృతదేహం కుళ్లిపోయే అవకాశం ఉండటంతో బతికిపోయావని..లేకుంటే చర్చలు జరిపేంతవరకు అంత్యక్రియలు చేయకపోయేవారని తెలిపారు. బాబు ఫ్యామిలీ కోరికమేరకే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రజాస్వామ్యం అందరికి హక్కు.. ఎవ్వరికీ భయం అవసరంలేదన్నారు. ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం కరీంనగర్ నుంచే తీరాలని..పోరాడితే పోయేదేమిలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ ఏందో ఆర్టీసీ కార్మికులు చూపిస్తారన్న ఆయన.. మందకృష్ణ కాలికి గాయం అయినా పోరాటం చేస్తున్నారన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే బాబు అంత్యక్రియలు చేశామని..లేకుంటే సీఎంకు చుక్కలు చూపించేవారమని సీరియస్ అయ్యారు ఎంపీ బండి సంజయ్.